ఏసీ డ్రెయిన్ పైపు నుండి నీరు రావడం లేదా? ఇవే కారణాలు కావచ్చు!

29  March, 2026

Subhash

 ఏసీ రన్ అవుతున్నప్పుడు లోపల పేరుకుపోయిన ధూళి, మురికి డ్రెయిన్ పైపులోకి వెళ్తాయి. కాలక్రమేణా ఈ మురికి పైపును అడ్డుకుంటుంది. దీనివల్ల నీరు బయటకు రాకుండా ఆగిపోతుంది.

డ్రెయిన్ పైపులో మురికి

ఏసీలో గ్యాస్ లీక్ అవుతుంటే దాని కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల ఎవాపరేటర్ కాయిల్స్ పై మంచు పేరుకుపోతుంది. ఫలితంగా నీరు ద్రవ రూపంలో బయటకు రాదు.

గ్యాస్ లీకేజీ సమస్య

ఏసీ లోపల నీటిని సేకరించే డ్రెయిన్ పాన్‌లో ఏదైనా చెత్త లేదా పాచి పేరుకుపోతే, నీరు పైపు వరకు వెళ్లదు. కొన్నిసార్లు ఏసీ లోపల నుండే నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది.

డ్రెయిన్ పాన్ అడ్డంకులు

ఏసీ ఇండోర్ యూనిట్ లేదా డ్రెయిన్ పైపు సరైన వాలు (Level) లో లేకపోతే, గురుత్వాకర్షణ శక్తి సరిగ్గా పనిచేయక నీరు పైపు ద్వారా బయటకు వెళ్లదు.

ఇన్‌స్టాలేషన్ లోపాలు

ఏసీని నిర్ణీత సమయంలో సర్వీసింగ్ చేయకపోతే ఫిల్టర్లు, కాయిల్స్ మురికిగా మారి మొత్తం ఏసీ డ్రైనేజీ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

సర్వీసింగ్ చేయకపోవడం

కొన్ని ఆధునిక ఏసీలలో నీటిని బయటకు పంపడానికి చిన్న పంపులు ఉంటాయి. ఆ పంపు పనిచేయకపోయినా నీరు బయటకు రావడం ఆగిపోతుంది.

పంపు వైఫల్యం

వెంటనే మెకానిక్‌ను పిలిపించి సర్వీసింగ్ చేయించుకోవాలి. చిన్న సమస్యను నిర్లక్ష్యం చేస్తే, అది కంప్రెసర్ లేదా ఇతర భాగాల మీద ప్రభావం చూపుతుంది.

ఏం చేయాలి?

ప్రతి 3 నెలలకు ఒకసారి ఫిల్టర్లను క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ఏసీ నీరు బయటకు వెళ్తుంది. పైపు కూడా సక్రమంగా పని చేస్తుంది.

ప్రతి 3 నెలలకు