Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్ తప్పుగా ఉందా? ఉచితంగా ఇంట్లో నుంచే ఇలా ఈజీగా అప్‌డేట్ చేసుకోండి..

మరి అలాంటి పత్రంలో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ డేటా వంటి ఇతర కీలక గుర్తింపు వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకుని అన్ని సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తప్పుగా ఉంటే.. లేదా అడ్రస్ మారితే ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Aadhaar Update: ఆధార్‌లో అడ్రస్ తప్పుగా ఉందా? ఉచితంగా ఇంట్లో నుంచే ఇలా ఈజీగా అప్‌డేట్ చేసుకోండి..
Aadhaar
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Jan 02, 2024 | 4:23 PM

ఆధార్ కార్డు ఎంత కీలకమైన పత్రమో మనందరికీ తెలుసు. దానిలో వివరాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ ఆధారంగా జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, ఏదైనా లోన్లు వంటివి దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కావాల్సిందే. మరి అలాంటి పత్రంలో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ డేటా వంటి ఇతర కీలక గుర్తింపు వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకుని అన్ని సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తప్పుగా ఉంటే.. లేదా అడ్రస్ మారితే ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియపై చాలా మందికి సందేశాలు ఉన్నాయి. ఆన్ లైన్లో మీరు సులభంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఆన్ లైన్లో ఉచితంగా..

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సహాయంతో అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్లో కి వెళ్లి ఆన్ లైన్ మోడ్లో అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ చొరవ, డిజిటల్ ఇండియా చొరవ వల్ల మాత్రమే ఉచిత సేవలు సాధ్యమయ్యాయి. myaadhaar.uidai.gov.in పోర్టల్ ఈ ప్రక్రియ సులభంగా చేసుకోవచ్చు. అలాగే వ్యక్తులు అధికారిక ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా వారి ఆధార్ కార్డ్ వివరాలను ఆఫ్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేయవచ్చు. అయితే, ఆఫ్‌లైన్ అప్‌డేట్‌కు వారు తమ ఆధార్‌లో చేసే ప్రతి మార్పు/అప్‌డేట్‌కు 50 రూపాయల రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది మార్చి 14 వరకూ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (పీఓఐ), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (పీఓఏ) వంటి వివరాల కోసం ఆధార్ కార్డ్ హోల్డర్‌లు ఉచిత అప్‌డేట్ సేవను ఉపయోగించడానికి యూఐడీఏఐ అనుమతిస్తుంది. ఇది ఆధార్ సంబంధిత మార్పుల కోసం ప్రభుత్వ సంస్థ అందించే ఇతర అప్‌డేట్ సేవలను ప్రభావితం చేయదు. అయితే ఈ సేవ ఆధార్‌లోని పేరు, లింగం, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వివరాల కోసం అప్‌డేట్‌లను కవర్ చేయదని గమనించడం ముఖ్యం. అలాగే గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ అప్ డేట్ చేయని వారిని కూడా ఒకసారి బయోమెట్రిక్స్ ఇచ్చి అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆన్ లైన్లో అప్ డేట్ ఇలా..

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మీ ఫోన్‌లో అందుకున్న వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని ఉపయోగించి లాగిన్ చేయండి.
  • డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగానికి వెళ్లి, కచ్చితత్వం కోసం మీ ప్రస్తుత వివరాలను సమీక్షించండి.
  • డ్రాప్-డౌన్ జాబితా నుంచి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోండి. ధ్రువీకరణ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్‌లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
  • మీ వివరాల అప్‌డేట్ ప్రక్రియ పురోగతిని ట్రాక్ చేయడానికి సేవా అభ్యర్థన నంబర్‌ను నోట్ చేసుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..