Vodafone Idea 5G Network Trial: వొడాఫోన్ ఐడియా 5జీ ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసా?

5G Network Trial: దేశంలోనే నంబర్ త్రీ టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా శుక్రవారం పూణెలో 5జీని పరీక్షించింది. ఈ సమయంలో..

Vodafone Idea 5G Network Trial: వొడాఫోన్ ఐడియా 5జీ ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసా?
Follow us
Venkata Chari

|

Updated on: Nov 28, 2021 | 2:03 PM

Vodafone Idea 5G Network Trial: దేశంలోనే నంబర్ త్రీ టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా శుక్రవారం పూణెలో 5జీని పరీక్షించింది. ఈ సమయంలో, కంపెనీ 4.1Gbps (సెకనుకు గిగాబైట్లు) వేగాన్ని సాధించింది. ఈ వేగం 26 GHz స్పెక్ట్రమ్‌లో పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది.

మూడు విభాగాల్లో ట్రయల్స్.. ట్రయల్ సమయంలో 4.1Gbps వేగం సాధించామని వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ తెలిపారు. 5G ట్రయల్స్ కోసం కంపెనీ పూణే, మహారాష్ట్ర, గాంధీనగర్‌లలో ఈ ప్రయోగాలను చేస్తుంది. గాంధీనగర్‌లో నోకియాతో, పూణేలోని ఎరిక్సన్‌తో ట్రయల్స్ నిర్వహించింది.

6 నెలల పొడిగింపు.. ప్రభుత్వం 5జీ ట్రయల్‌ను 6 నెలలు పొడిగించినట్లు జగ్బీర్ సింగ్ తెలిపారు. ఇది మే 2022 వరకు లేదా స్పెక్ట్రమ్ వేలం వరకు పొడిగించినట్లు తెలిపారు. అయితే ఇందులో ఏది త్వరగా జరిగితే, ఆ తేదీ నాటికి కంపెనీ ట్రయల్ చేసుకునేందుకు అనుమతి ఉంది. విచారణను మే వరకు పొడిగించామని, అయితే స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తేదీని ప్రకటించలేదని చీఫ్ కార్పొరేట్ ఆఫీసర్ పి.బాలాజీ తెలిపారు.

మెడికల్, క్లౌడ్ గేమింగ్ కోసం ఉత్తమం.. 5జీ, వైద్య సదుపాయాలు, క్లౌడ్ గేమింగ్, పబ్లిక్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ వినియోగంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సులువుగా చేయవచ్చని వోడాఫోన్ ఇండియా ఈ ట్రయల్‌లో తెలిపింది. వొడాఫోన్ ఎగ్జిక్యూటివ్‌లు 5G రాకతో, ప్రతిదీ చాలా సులభం అవుతుంది. ఎందుకంటే 4G వేగంతో ఇవన్ని అంత వేగంగా కవర్ చేయలేవని సంస్థ పెర్కొంది.

నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై దృష్టి.. వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. రాబోయే కాలంలో తమ నెట్‌వర్క్ బాగుంటుందని కంపెనీ విశ్వసిస్తోంది. 5G వినియోగంతో ప్రజలు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆటలు ఇతర రంగాలలో చాలా సులభంగా సౌకర్యాలను పొందుతారు. కంపెనీ ఇటీవల కొత్త టారిఫ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వోడాఫోన్ తన టారిఫ్ ప్లాన్‌ల ధరలను 20% నుంచి 25% వరకు పెంచింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 99 నుంచి మొదలై రూ. 2,399 వరకు ఉంటుంది.

Also Read: Train Tickets: ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌లో PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL, RSWL, CKWL అనే పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?