AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Tickets: ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌లో PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL, RSWL, CKWL అనే పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Train Ticket Reservation System: భారత్‌లో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైళ్లలో సుఖవంతమైన..

Train Tickets: ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌లో PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL, RSWL, CKWL అనే పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Nov 28, 2021 | 9:39 AM

Share

Train Ticket Reservation System: భారత్‌లో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైళ్లలో సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. అయితే రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా బుక్‌ చేసుకుంటే ఇంకా మంచిది. కానీ టికెట్ల రిజర్వేషన్‌లలో ఒకసారి బుక్‌ కావచ్చు.. లేదా రద్దు కావచ్చు. అక్కడ ఉండే సీట్లను బట్టి ఉంటుంది. ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాలంటే మూడు మార్గాలలో రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌, రైలు టికెట్‌ ఏజంట్‌ ద్వారా, ఐఆర్‌సీటీసీ ద్వారా రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. కొన్ని సార్లు రద్దీగా ఉండే మార్గం కారణంగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ కావడం కష్టంగా ఉంటుంది. అయితే రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా బెర్త్‌ కన్ఫర్మ్‌ అయితే కన్ఫర్మ్‌ అయినట్లు స్టేటస్‌ చేపిస్తుంది. అలాగే వేయిటింగ్‌ లిస్టులో ఉంటే PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL,RSWL, CKWL అనే పదాలు కనిపిస్తుంటాయి. వీటికి అర్ధాలు ఏమింటో ఎప్పుడైన మీరు తెలుసుకున్నారా…? ఇప్పుడు తెలుసుకుందాం.

GNWL: General Waiting List: రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలో ఈ జీఎన్‌డబ్ల్యూఎల్‌ (GNWL) ఉంటుంది. ఇలా కనిపిస్తే బెర్త్ క‌న్‌ఫాం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. రైలు ప్రారంభమయ్యే స్టేష‌న్ లేదా దాని రూట్‌లో ఉన్న ఏదైనా స్టేష‌న్ నుంచి మ‌నం టికెట్లను బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఇలా మ‌న‌కు చూపిస్తుంది.

RAC: ఈ జాబితాలో రైల్వే టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్ఏసీ (RAC)లో ఉంటే చాలా వ‌ర‌కు టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయిపోతాయి. అయితే కొన్ని సందర్భాలలో ఒకే బెర్త్‌లో ఇద్దరికి కేటాయించబడుతుంది. సర్దుబాటు చేసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి తక్కువ సమయంలో ఎదురవుతుంటాయి.

WL: Waiting List: ఇది వెయిటింగ్‌ లిస్ట్‌. మీరు టికెట్‌ బుక్‌ చేశాక టికెట్‌ కన్ఫర్మ్‌ కాకపోతే ఇది చూపిస్తుంది. టికెట్లు కన్ఫర్మ్‌ అయిన వారు ఎవరైనా రద్దు చేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు WL12 అని రాసి ఉంటే 12వ వ్యక్తి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే మీకు టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

RLWL: Remote Location Waiting List: రైలు టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లో ఇలా స్థితి ఉంటే ఈ టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయ్యేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని అర్థం. రైలు ప్రయాణించే మార్గంలో ఏదైనా స్టేషన్‌లో బెర్త్‌లు ఖాళీలు అయ్యే అవకాశాలు ఉంటే ఇలా చూపిస్తుంది.

RSWL: Roadside Station Waiting List: ఇలా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఏవైనా బెర్త్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఇలా చూపిస్తుంది. ఇవి కూడా ఖరారు అయ్యే అవకాశం చాలా తక్కువ.

RQWL: Request Waiting List: మార్గమధ్యంలో ఉండే ఒక స్టేషన్‌ నుంచి ఇంకో స్టేషన్‌కు టికెట్‌ బుక్‌ చేస్తే అది జనరల్‌ కోటాలో లేదా రిమోట్‌ లొకేషన్‌ లేదా పూర్తి కోటలో చూపించబడకపోవడాన్ని ఈ లిస్ట్‌లో చూపిస్తుంది.

TQWL(formerly CKWL): ఇది తాత్కాల్‌ కోట కిందకు వస్తుంది. గతంలో తత్కాల్‌ కోటలో సీకేడబ్ల్యూఎల్‌ (CKWL) చూపించే వారు. కానీ ఇప్పుడు టీక్యూడబ్ల్యూఎల్‌ (TQWL)గా మార్చింది రైల్వే శాఖ.

PQWL: A Pooled Quota Waiting List: ఒక రైలుకు కేవలం ఒక పూర్తి కోట మాత్రమే ఉంటుంది. రైలు ప్రారంభమయ్యే, రైలు నిలిచిపోయే స్టేష‌న్‌ల‌కు టికెట్లను ఇస్తారు. లేదా రైలు నిలిచిపోయే స్టేష‌న్‌కు ఒక‌టి రెండు స్టేష‌న్ల ముందు వ‌ర‌కు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్‌లకు ఈ లిస్టును చూపిస్తారు. అనేక రైల్వే స్టేషన్‌లలో బెర్త్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఒకే ఫూల్‌ కోటలో చూపిస్తాయి. ఇవి కూడా కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?

Solar Eclipse 2021: డిసెంబర్‌ 4న సూర్యగ్రహణం.. మన దేశంలో కనిపిస్తుందా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?