Twitter: ట్విట్టర్లో సరికొత్త ఫీచర్.. ఇక వారికి డబ్బులే డబ్బులు.. అదేంటి, ఎలా ఉపయోగించాలో తెలుసా?

Twitter Bitcoin Tipping Feature: ఈ ఫీచర్ మొదట ఐఓఎస్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Twitter: ట్విట్టర్లో సరికొత్త ఫీచర్.. ఇక వారికి డబ్బులే డబ్బులు.. అదేంటి, ఎలా ఉపయోగించాలో తెలుసా?
Twitter's New Bitcoin Tipping Feature

Twitter: యూజర్ల అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందిస్తూ సోషల్ మీడియాలో తన సత్తా చాటుతోంది ట్విట్టర్. తాజాగా ఓ సరికొత్త పీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కంటెంట్ క్రియోటర్లకు మరింత ఎక్కువగా డబ్బు అందనుంది. అదే బిట్‌కాయిన్ ఫీచర్. ఈ ఫీచర్‌ను ఉపయోగించి యూజర్లు తమకు అత్యంత ఇష్టమైన కంటెంట్ క్రియేటర్లకు టిప్ ఇవ్వొచ్చని ట్విట్టర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌తో ట్విట్టర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు భౌగోళిక పరిమితులు లేకుండా ప్రపంచంలో ఎక్కడి నుండైనా డబ్బు సంపాదించడానికి అనుమతిస్తుంది. బిట్‌కాయిన్ లైట్‌నింగ్ నెట్‌వర్క్‌లో నిర్మించిన స్ట్రైక్ అనే ప్లాట్‌ఫారమ్‌తో భాగస్వామ్యైన ట్విట్టర్.. ఈ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది ఎటువంటి రుసుములు లేకుండా త్వరతిగతిన అంతర్జాతీయ చెల్లింపులను చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ యాప్‌, డెస్‌టాప్‌లో ఒక చిన్న మనీ సింబల్‌ను జోడించింది. దీనిని ఆన్ చేస్తే, సృష్టికర్త ప్రొఫైల్‌లో కనిపిస్తుంది. దీంతో బిట్‌కాయిన్ ఆమోదించబడుతున్నట్లు ఇతరులకు తెలిసేలా చేస్తుంది. దీంతో యూజర్లు తమ ఇష్టమైన కంటెంట్ క్రియోటర్లకు డబ్బులు పంపొచ్చు.

ట్విట్టర్ ద్వారా టిప్‌ను పంపడం ఎలా:

ట్విట్టర్ ద్వారా టిప్‌లు పంపడం చాలా సులభం. మీరు కింద పేర్కొన్న ప్రకారం చేస్తే చాలు.

1. దీని కోసం స్ట్రైక్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో సైన్ అప్ చేయాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అలాగే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ కోసం డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ యాప్ అందుబాటులో ఉంది.
మీ నాన్-కస్టోడియల్ స్ట్రైక్ వాలెట్‌లో ట్విట్టర్ చిట్కాగా మీరు ఎవరికైనా పంపాలనుకుంటున్న బిట్‌కాయిన్‌ను డిపాజిట్ చేయండి.

2. నాన్-కస్టోడియల్ వాలెట్‌లు వినియోగదారులకు వారి నిధులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాయి. అలాగే ప్రైవేట్ కీని కలిగి ఉండేందుకు కూడా అనుమతి ఉంది. అలాగే కీలకు పూర్తి రక్షణను కూడా అందిస్తుంది.

3. ఆ తరువాత ట్విట్టర్‌కి తిరిగి వచ్చి, మీరు క్రిప్టోకరెన్సీ టిప్‌ను ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌ని ఓపెన్ చేయాలి. అక్కడ మనీ లేబుల్‌ను నొక్కాలి. ఇది అకౌంట్ హోల్డర్ బిట్‌కాయిన్ టిప్‌లను అంగీకరిస్తున్నట్లు చూపిస్తుంది.

4. ఆ తరువాత మీరు కావాలంటే టిప్‌తో పాటు చిన్న సందేశాన్ని కూడా జోడించవచ్చు.

5. అనంతరం ఓపెన్ వాలెట్ ఎంపికను ఎంచుకోండి. మీరు మొదట మీ బిట్‌కాయిన్ టిప్‌ను డిపాజిట్ చేసిన మీ నాన్-కస్టోడియల్ వాలెట్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

6. ఆ తరువాత కన్ఫామ్ పేమెంట్‌పై క్లిక్ చేయాలి. దీంతో ఫండ్-లోడ్ చేయబడిన బిట్‌కాయిన్ టిప్ తక్షణమే వారి వాలెట్‌కు బదిలీ చేయబడుతుంది.

ఈ ఫీచర్ మొదట ఐఓఎస్ యూజర్లకు మాత్రమే విడుదల చేశారు. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి స్ట్రైక్ యాప్ ఎల్ సాల్వడార్‌తోపాటు యూఎస్‌లోని మెజారిటీ ప్రాంతాలలో అందుబాటులో ఉంది. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Also Read: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..

Nasa mission: సైక్‌ ఆస్టరాయిడ్‌లో అత్యంత అరుదైన, విలువైన లోహాలు. నిగ్గుతేల్చే ప్రయోగానికి నాసా రెడీ

Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికిల్స్ మంటల్లో ఎందుకు చిక్కుకుంటాయో తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu