AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenovo Laptop: లెనోవా నుంచి మరో సూపర్ ల్యాప్ టాప్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవాకు మన దేశంలో మంచి ఆదరణ ఉంది. ఈ చైనీస్ బ్రాండ్ ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. వాటిలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ప్యాడ్ లు (టాబ్లెట్లు) ప్రముఖంగా ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ల్యాప్ టాప్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటిలో అనేక రకాల మోడళ్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. తక్కువ బరువు ఉండడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగ పడేలా లెనోవా ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 విడుదలైంది. దీని ధర రూ.63,790 నుంచి ప్రారంభమవుతుంది. దీని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lenovo Laptop: లెనోవా నుంచి మరో సూపర్ ల్యాప్ టాప్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..!
Lenovo Ideapad Slim 3
Nikhil
|

Updated on: Apr 26, 2025 | 11:53 AM

Share

లెనోవా ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రోజు వారీ పనులను చాలా వేగంగా, సులువుగా చేసుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికైనా చాాలా ఉపయోగంగా ఉంటుంది.. 14, 15.3, 16 అంగుళాల పరిమాణంలో బహుళ ప్యానెల్ ఎంపికలో లభిస్తుంది. పెద్ద టచ్ ప్యాడ్, 0.1 ఎంఎం డిష్ట్ కీబోర్డు, అదనపు మన్నిక కోసం మెటల్ చాసిస్ తో తీసుకువచ్చారు. చాలా పోర్టబుల్ గా, తక్కువ బరువుతో కేవలం 16.95 ఎంఎం మందంతో సన్నగా ఉంటుంది.

ఐడియా ప్యాక్ స్లిమ్ 3 పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తాజా ఇంటెల్ రాప్టర్ లేక్ హెచ్, ఏఎండీ హాక్ పాయింట్ ప్రాసెసర్ల నుంచి శక్తిని పొందుతుంది. స్మార్ట్ పవర్ ఆప్లిమైజేషన్ తో పనితీరు మెరుగ్గా ఉండడంతో పాటు విద్యుత్ వాడకం తక్కువ అవుతుంది. కనెక్టివిటీ కోసం పూర్తి యూఎస్ బీ – సీ పోర్టు, డ్యూయల్ ఎస్ఎస్ డీ స్లాట్లు ఏర్పాటు చేశారు. వీటిలో పాటు ప్రైవసీ షట్టర్, డ్యూయల్ మైక్ అర్రే, మంచి ఆడియోను అందించే పూర్తి హెచ్ డీ, ఐఆర్ కెమెరాలు ఉన్నాయి. దీనిలో రాపిడ్ బూస్ట్ టెక్నాలజీ ఉంది. దీనిలో 60 డబ్ల్యూహెచ్ ఆర్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు. ఎక్కువ గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోవచ్చు.

మన దేశంలో కొత్త లెనోవా ల్యాప్ టాప్ ధర రూ.63,790 నంచి ప్రారంభమవుతుంది. లెనోవా.కమ్, లెనోవా ఎక్స్ క్లూజివ్ స్టోర్స్, అన్ని ఇ-కామర్స్ ప్లాట్ ఫాంల నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆఫ్ లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి ఒక ఏడాది వారంటీ ఉంది. ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజీ ప్రొటెక్షన్ మద్దతు ఉంది. ల్యాప్ టాప్ ను ఎంఐఎల్ – ఎస్టీడీ 810 హెచ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. రోజు వారీ పనులు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈపీఈఏటీ గోల్డ్ రేటింగ్, మైక్రోఫోన్లు, ఏఐ సాఫ్ట్ వేర్ తో కూడిన వెబ్ క్యామ్ అదనపు ప్రత్యేకతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?