AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: ఇంట్లో ఎంత బంగారం, నగదు ఉంచుకోవచ్చు.. నిబంధనలు ఏమిటి..?

Income Tax Rules: మీడియా నివేదికల ప్రకారం, ఇంట్లో నగదు ఉంచుకోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి పరిమితిని విధించలేదు. దీని అర్థం మీరు ఇంట్లో ఎంత నగదునైనా ఉంచుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే దానికి..

Income Tax Rules: ఇంట్లో ఎంత బంగారం, నగదు ఉంచుకోవచ్చు.. నిబంధనలు ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Apr 25, 2025 | 2:24 PM

Share

Income Tax Rules: ఆదాయపు పన్ను శాఖ ఒకరి ఇల్లు లేదా కార్యాలయంపై దాడి చేసి పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మీరు చాలాసార్లు వినే ఉంటారు. అలాంటి సందర్భాలలో కొన్నిసార్లు నగదు, నగలు స్వాధీనం చేసుకుంటారు. కొన్నిసార్లు ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేస్తారు. ఇది ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇంట్లో అదనపు నగదు లేదా ఆభరణాలను ఉంచుకోవడం చట్టబద్ధంగా నేరమా? దీన్ని మనం ఇంట్లో ఉంచుకోగలిగితే, మనం ఎంత ఉంచుకోగలం? దాని గురించి తెలుసుకుందాం.

ఇంట్లో నగదు ఉంచడానికి నియమాలు:

మీడియా నివేదికల ప్రకారం, ఇంట్లో నగదు ఉంచుకోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి పరిమితిని విధించలేదు. దీని అర్థం మీరు ఇంట్లో ఎంత నగదునైనా ఉంచుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అధిక మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. దీన్ని మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో పేర్కొనాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 68 నుండి 69B వరకు మూలం లేని ఆదాయానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. మీరు నగదు మూలాన్ని వివరించలేకపోతే, దానిని మూలం లేని ఆదాయంగా పరిగణిస్తారు. దానిపై భారీ జరిమానా విధించవచ్చు. దీనిపై దాదాపు 78 శాతం పన్ను విధించే అవకాశం ఉంటుంది.

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు!

భారతదేశంలో ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి ఒక పరిమితిని నిర్ణయించారు. దీని ప్రకారం, ఇంట్లో పురుషులు, మహిళలకు ఈ పరిమితి భిన్నంగా ఉంటుంది. CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నిబంధనల ప్రకారం.. మీరు ఇంట్లో కొంత మొత్తంలో బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు. మీరు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని ఉంచుకుంటే మీరు దానికి రుజువును అందించాలి. బంగారం కొనుగోలుకు సంబంధించిన రసీదులు మొదలైనవి కూడా మీ వద్ద ఉండాలి.

మహిళలు ఎంత బంగారం ఉంచుకోవచ్చు?

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు ఇంట్లో 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. పెళ్లికాని మహిళలకు బంగారం ఉంచుకునే పరిమితిని 250 గ్రాములుగా నిర్ణయించారు. అయితే పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి