Computer Malware: మీ కంప్యూటర్ సురక్షితంగానే ఉందా? ఈ లక్షణాలుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే!!
ఇలాంటి వైరస్ ల నుంచి మీ సిస్టమ్ ను కాపాడుకోడానికి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడం చాలా ముఖ్యం. అయితే అసలు కంప్యూటర్‌కు వైరస్ సోకిందని తెలుసుకోవటమెలా? ఇదిగో ఈ పది లక్షణాలు మీ కంప్యూటర్లో కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి.
మనిషిని అనారోగ్యం పాలు చేసే వైరస్ చాలానే ఉన్నాయి. అలాగే కంప్యూటర్లకు వైరస్ లు వస్తాయని వాటిని వాడే వారికి తెలిసే ఉంటుంది. అయితే ఇది మనిషికి సోకిన వైరస్ లాంటిది కాదు. నిజానికి అసలు ఎటువంటి జీవీ కాదు. కంప్యూటర్ల వైరస్ అంటే అది ఓ ప్రోగ్రామ్. మన ప్రమేయం లేకుండానే పీసీలో ఇన్‌స్టాల్ అయ్యి హానికర పనులు చేస్తుంది. మొత్తం పనితీరునే మార్చేస్తుంది. కొన్ని ఈమెయిల్స్, హానికరమైన వెబ్ సైట్లు ఓపెన్ చేయడం ద్వారా ఇవి మన కంప్యూటర్లలోకి చేరతాయి. అందుకే ఇలాంటి వైరస్ ల నుంచి మీ సిస్టమ్ ను కాపాడుకోడానికి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడం చాలా ముఖ్యం. అయితే అసలు కంప్యూటర్‌కు వైరస్ సోకిందని తెలుసుకోవటమెలా? ఇదిగో ఈ పది లక్షణాలు మీ కంప్యూటర్లో కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి. అవేంటో చూద్దాం రండి..
కంప్యూటర్ పనితీరు తగ్గిపోతోంది.. మామూలు వేగం కన్నా మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుంటే అనుమానించాల్సిందే. వైరస్ సోకినప్పుడు కంప్యూటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లో కంప్యూటర్ బగ్స్ నిరంతర పనిచేస్తూనే ఉంటాయి. దీంతో పీసీ మీ ఎక్కువ భారం పడుతుంది. చాలా పనులు చేయాల్సి వస్తుంది దీంతో వేగం గణనీయంగా పడిపోతుంది.
అర్థంకాని ప్రవర్తన.. ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ మీ సిస్టమ్ లో చొరబడితే అది విపరీతంగా ప్రవర్తిస్తుంది. అంటే మాటిమాటికీ ఆఫ్ అయిపోవడం, దానంతటే అదే రీస్టార్ట్ కావొచ్చు. కొన్ని సార్లు హార్డ్ డిస్క్ లో స్పేస్ పూర్తిగా నిండుకోవచ్చు. లేదంటే డేటా గానీ ప్రోగ్రామ్ లు గానీ అదృశ్యమైనపోవచ్చు. ఆటోమేటిక్ గా యాప్ లు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
అనవసరమైన పాప్ అప్ లు.. ఏదైనా వెబ్ సైట్ చూస్తున్నప్పుడు మామూలుగా కన్నా పెద్ద మొత్తంలో పాపప్ లు దర్శనమిస్తుంటే వైరస్ సోకిందేమోనని అనుమానించాలి. బ్రౌజర్ లో వెబ్ సైట్లలో యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నా ఏదో సమస్య ఉన్నట్టే. యాడ్ వేర్ ద్వారా ఇలాంటి వైరస్ లు వ్యాపిస్తుంటాయి.
ఫైల్స్ మిస్ అవ్వడం.. మీ సిస్టమ్ లోని ఫైల్స్, ఫోల్డర్లు, డ్యాక్యుమెంట్లు మిస్ అవుతాయి. వాటిని వెతకడం కష్టమవుతుంది. ఏదైనా హానికరమైన ప్రోగ్రామ్ లు ఇన్ స్టాల్ అయినప్పుడు మన పీసీలోని ఫైళ్లు యాక్సెస్ కావు. అనుమతి లేదని చెబుతుంది.
తరచూ క్రాష్ అవుతుంది.. మీ కంప్యూటర్ తరచూ క్రాష్ అవుతున్నట్లయితే లేదా సాధారణం కంటే ఎక్కువగా ఎర్రర్ మెసేజ్‌లను చూపుతున్నట్లయితే, అది వైరస్ లేదా మాల్వేర్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తుందనడానికి సంకేతం కావచ్చు.
ఇతర వెబ్ సైట్లలోకి ఆటోమేటిక్ గా.. మీరు కంప్యూటర్ లో వర్క్ చేస్తున్నప్పుడు.. అకస్మాత్తుగా మీ కంప్యూటర్‌లో కొత్త అప్లికేషన్ ఓపెన్ అయినా.. లేదా ఒక సైటుకు బదులు మరో సైట్ ఓపెన్ కావడం వంటివి తరచూ జరుగుతుంటే అది మాల్వేర్ ప్రభావం వల్ల కావొచ్చు.
ఫోల్డర్ లోపల నకిలీ ఫోల్డర్.. కంప్యూటర్‌లలో కనిపించే అత్యంత సాధారణ వైరస్‌లలో ఒకటి ఫోల్డర్‌లో నకిలీ ఫోల్డర్‌ను సృష్టించడం. వాటిని తొలగించవచ్చు, కానీ అవి మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. మీ పీసీలో ఇది గమనిస్తే వెంటనే వైరస్ అటాక్ చేసినట్లు గుర్తించాలి.
డేటా వినియోగం పెరిగింది.. దాడులు చేయడానికి లేదా డేటాను సంగ్రమించడానికి హ్యాకర్లు ఆన్ లైన్ లో భారీ నెట్ వర్క్ లను వాడుకుంటూ ఉంటారు. దీంతో డేటా ఎక్కువగా ఖర్చవుతుంటుంది. కాబట్టి హఠాత్తుగా ఇంటర్నెట్ వాడకం పెరిగినట్టు గమనిస్తే వైరస్ సోకిందని గమనించాలి.
సీపీయూపై అధిక ఒత్తిడి.. కంప్యూటర్ వాడకపోయినా కూడా హార్డ్ వేర్ నిరంతరం శబ్దం చేస్తోందా? మామూలుగా కన్నా ఎక్కువగా శబ్దం వస్తోందా? అతిగా, వేగంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే వైరస్ బారినపడి ఉండోచ్చు. విండోస్ అప్ డేట్ అయినప్పుడో, ఏదైనా ఉచితమైన ప్రాసెస్ జరుగుతున్నప్పుడో పీసీ లేదా ల్యాప్ టాప్ తెర తిగిగి వెలుగుతుంటుంది. ఇలాంటివేవి లేకుండానే ఉన్నట్టుండి వెలిగితే వైరస్ సోకిందటానికి సంకేతం కావొచ్చు.
యాంటీవైరస్ లు డియాక్టివేట్ అవుతాయి.. మీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్ గా డిసేబుల్ అయిపోతుంటే.. లేదా యాప్ సరిగ్గా పని చేయకపోయినా ఏదో మాల్వేర్ దానిని అటాక్ చేస్తున్నట్లు గుర్తించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..