AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Fiber: కేవలం రూ. 198కే జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. స్పీడ్ బూస్టర్ల కోసం సరికొత్త పాస్లు.. వివరాలు ఇవి..

జియో ఓ అడుగు ముందుకేసి ఓ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. అది బ్రాండ్ బ్యాండ్ సంబంధించిన ఎంట్రీ లెవెల్ ప్యాక్. కేవలం నెలకు రూ. 198తో ఇది ప్లాన్ ప్రారంభం అవుతుంది. దీని పేరు బ్రాండ్ బ్యాండ్ బ్యాక్ అప్ ప్లాన్. గతంలో జియో బ్రాండ్ బ్యాండ్ ప్రారంభ ప్లాన్ ధర నెలకు రూ. 399 నుంచి ఉండేది.

Jio Fiber: కేవలం రూ. 198కే జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. స్పీడ్ బూస్టర్ల కోసం సరికొత్త పాస్లు.. వివరాలు ఇవి..
Jio Fiber
Madhu
|

Updated on: Apr 23, 2023 | 5:00 PM

Share

మన భారతదేశంలో టెలికాం రంగంలో రెండు దిగ్గజాలు ఎయిర్ టెల్, జియో. ఒకదానికొకటి ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు 5జీ విషయంలోనూ రెండూ పోటాపోటీగా సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో జియో ఓ అడుగు ముందుకేసి ఓ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. అది బ్రాండ్ బ్యాండ్ సంబంధించిన ఎంట్రీ లెవెల్ ప్యాక్. కేవలం నెలకు రూ. 198తో ఇది ప్లాన్ ప్రారంభం అవుతుంది. దీని పేరు బ్రాండ్ బ్యాండ్ బ్యాక్ అప్ ప్లాన్. గతంలో జియో బ్రాండ్ బ్యాండ్ ప్రారంభ ప్లాన్ ధర నెలకు రూ. 399 నుంచి ఉండేది. ఇప్పుడు దానిని కేవలం రూ. 198కి జియో తీసుకొచ్చింది. ఇక ఈ ప్లాన్ తీసుకున్న వారు ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకునేందుకు పాస్‍లను కూడా జియో తీసుకొచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న దృష్ట్యా వినియోగదారులకు అపరిమిత ఇంటర్ నెట్ ను అందించేందుకు మార్చి 30వ తేదీ నుంచే ఈ ప్లాన్ ను జియో అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఓ సారి చూద్దాం..

ఇది ప్లాన్..

జియోఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాక్-అప్ ప్లాన్ నెలకు రూ.198 ధరతో ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ వేగంతో అన్‍లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఈ స్పీడ్‍ను ప్రత్యేకమైన పాస్‍ల ద్వారా పెంచుకునే సదుపాయం కూడా ఉంది. రూ.21 పాస్ తీసుకుంటే ఒక రోజుకు 30 ఎంబీపీఎస్ వేగాన్ని, రూ.32 పాస్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్ పొందవచ్చు. రెండు రోజులు, ఏడు రోజులకు కూడా ఈ స్పీడ్ బూస్టర్ పాస్‍లు ఉంటాయి.

రీచార్జ్ ఇలా..

ఇప్పటికే ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ పని చేయకుండా ఉన్నా.. మెయింటెన్స్ లేక డౌన్ అయినా ఈ బ్యాక్-అప్ సర్వీస్ ను ఎంపిక చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లు ఈ ఈ జియో ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాకప్ ప్లాన్ కావాలంటే కస్టమర్లు ముందుగా రూ.1,490 (ఐదు నెలలకు గాను రూ.990, ఇన్‍స్టాలేషన్‍కు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి జీఎస్‍టీ అదనంగా ఉంటుంది. ఈ రూ.198 ప్లాన్ తీసుకున్న వారు ఎంటర్‌టైన్‍మెంట్ అప్‍గ్రేడ్ కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.100, రూ.200 అప్‍గ్రేడ్ ప్లాన్లు ఉన్నాయి. రూ.100 ఎంటర్‌టైన్‍మెంట్ అప్‍గ్రేడ్ ఎంచుకుంటే 6 ఓటీటీ యాప్స్, 400 లైవ్ టీవీ చానెల్స్ సహా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.200 ఎంపిక చేసుకుంటే 14 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్, 550 లైవ్ టీవీ చానెల్స్ సహా మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us