New Smartphones: త్వరలోనే మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. కొత్త ఏడాది హల్‌చల్ చేసిన ఫోన్లు ఇవే..!
పెరిగిన టెక్నాలజీ ప్రకారం స్మార్ట్‌ఫోన్లు ఆరంగేట్రం చేయడంతో ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో యువత నుంచి వచ్చిన అనూహ్య డిమాండ్ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ నెలతో పాటు వచ్చే ఏడాది అంటే 2024 మార్కెట్‌లో రిలీజవ్వబోయే ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా యువత స్మార్ట్‌ఫోన్లను అధికంగా వాడుతున్నారు. అంతేకాదు అందులో వచ్చే యాప్స్‌ను ఇష్టపడుతున్నారు. గతంలో ఫోన్ అంటే కేవలం మెసేజ్‌లు, ఫోన్లకు మాత్రమే వాడేవారు. కానీ పెరిగిన టెక్నాలజీ ప్రకారం స్మార్ట్‌ఫోన్లు ఆరంగేట్రం చేయడంతో ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో యువత నుంచి వచ్చిన అనూహ్య డిమాండ్ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ నెలతో పాటు వచ్చే ఏడాది అంటే 2024 మార్కెట్‌లో రిలీజవ్వబోయే ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
వన్‌ప్లస్ 12
వనప్లస్ 12 ఫోన్ డిసెంబర్ 5న చైనాలో రిలీజ్ అవ్వనుంది. ఈ ఫోన్ భారత్‌లో జనవరి 23, 2024లో రిలీజ్ అవ్వనుంది. ఈ ఫోన్ భారతదేశంలో వన్ ప్లస్ 11 5జీ కంటే ఎక్కువ ధర ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐక్యూ 12 5జీ
ఐక్యూ 12 5జీ ఫోన్ డిసెంబర్ 12న భారతదేశంలో రిలీజ్ అవ్వనుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ అల్ల్రావైడ్ కెమెరా, 64 ఎంపీ పెరీస్కోపిక్ లెన్స్‌తో ఫొటోగ్రఫీ ప్రియులకు మంచి ఎంపికగా ఈ ఫోన్ ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.60,000 లోపు వరకూ ఉంటుంది.
రియల్ మీ జీటీ 5 ప్రో
రియల్‌మీ జీటీ 5 ప్రో ఫోన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ డిసెంబర్ 7న చైనాలో రిలీజ్ కానుంది. అయితే ఈ ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో? అనే వివరాలు తెలియరాలేదు. అయితే ఈ ఫోన్ వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ కానుంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉండవచ్చు.
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్ మిడ్ రేంజ్ సిరీస్‌లో అత్యంత అనువైన ఫోన్‌గా దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ జనవరి 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.15 వేల లోపు అందుబాటులో ఉండవచ్చు. భారతదేశంలో రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ టాప్-ఎండ్ ఫోన్ రూ.30 వేల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.