Airtel: అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచితంగా ఓటీటీ.. ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్
ఇందులో భాగంగా ఓటీటీ సేవలతో పాటు, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటి బోనస్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ ఓ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు ఉచితంగా ఓటీటీ సేవలను పొందే అవకాశం కల్పించింది. ఇంతకీ ఈ రీఛార్జ్ ప్లాన్ ఏంటి.? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ప్రస్తుతం దేశ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. టెలికం కంపెనీలు దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక టెలికం కంపెనీలు సైతం రకరకాల ఆఫర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఓటీటీ సేవలతో పాటు, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటి బోనస్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ ఓ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు ఉచితంగా ఓటీటీ సేవలను పొందే అవకాశం కల్పించింది. ఇంతకీ ఈ రీఛార్జ్ ప్లాన్ ఏంటి.? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఎయిర్‌టెల్ రూ. 869 ప్లాన్‌తో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీని ఉచితంగా యాక్సెస్ చేసుకోవవచ్చు. మూడు నెలల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు. 64 కేబీపీఎస్ స్పీడ్‌తో 5జీ ఇంటర్‌నెట్ పొందొచ్చు. వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు.
ఇక ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్‌పై మరో ఆఫర్ సైతం అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. మూడు నెలలపాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సేవలను సైతం పొందొచ్చు. ఇదిలా ఉంటే ఇలాంటి ఆఫర్‌నే ఇప్పటికే జియో తీసుకొచ్చింది. జియోలో రూ. 808తో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల వాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..