- Telugu News Photo Gallery Technology photos Honour launches new budget smartphone Honor X7b, Have a look on features and price
Honor X7b: హానర్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 108 ఎంపీ కెమెరాతో పాటు..
మార్కెట్లో పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హానర్ ఓ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Dec 04, 2023 | 11:02 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ హానర్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ ఎక్స్7బీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

6.8 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ స్క్రీన్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం. ఇక ఎమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 35 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందులోబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్ ధర మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 వేల వరకు ఉండొచ్చని అంచనా.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-పై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 2.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.





























