- Telugu News Photo Gallery Technology photos Oppo offering best discount on Oppo Reno 10 Pro 5G phone, check here for full details
Oppo Reno 10: ఒప్పో ప్రీమియం ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్.. ఎంతంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో త్వరలోనే ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అంతకుముందు విడుదల చేసిన ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. గత జూలైలో ఒప్పో 10 సిరీస్ నుంచి రెనో 5జీ, రెనో 10 ప్రో+లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?
Updated on: Dec 05, 2023 | 12:01 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తన లేటెస్ట్ మోడల్ ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌పై ఒప్పో రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. రిలయన్స్, క్రోమాతో పాటు పలు ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో రెనో 10 ప్రో 5జీ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ లాంచింగ్ ధర రూ. 39,999 కాగా ప్రస్తుతం రూ. 2 వేల డిస్కౌంట్‌తో లభిస్తోంది ఈ ఫోన్ గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే షేడ్ కలర్స్‌లో లభిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ డస్‌ప్లేను అందించారు. అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 778జీ 5జీ ఎస్వోపీ చిప్‌సెట్‌ను అందించారు. 80 వాట్స్ సూపర్ వూక్ ఫ్లాష్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆండ్రాయడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్ + ఈ ఫోన్ స్క్రీన్ సొంతం.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్‌ను అందించారు.




