- Telugu News Photo Gallery Technology photos Now users can share their whatsapp status instantly in instagram story
Whatsapp Instagram: అదిరిపోయే ఫీచర్.. వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా..
ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెటా యాజమాన్యానికి చెందిన ఈ రెండు సోషల్ మీడియా సైట్స్ నిత్యం ఏదో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసంధానిస్తూ ఈ ఫీచర్‌ను తెచ్చారు..
Updated on: Dec 06, 2023 | 12:37 PM

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ తమ యూజర్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈరెండు యాప్స్‌ను ఇంటర్ లింక్ చేస్తూ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసే ఫొటోను అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ పోస్ట్ చేసే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! అచ్చంగా ఇలాంటి ఐడియాతోనే ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు.

డబ్ల్యూఏబెటాఇన్ఫో నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆండ్రాయ్ 2.23.25.20 అప్‌డేట్ వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అప్‌డేట్ స్టేటస్-షేరింగ్ ఫీచర్‌ని మరింత మెరుగుపరచడానికి కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది.

ఇదిలా ఉంటే వాట్సాప్ స్టేటస్‌లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే సమయంలో ఎడిటింట్ ఫీచర్స్‌తో మరిన్ని మార్పులు చేసుకోవచ్చు. ఇలా రెండు యాప్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా యూజర్లకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వొచ్చని మెటా భావిస్తోంది.





























