BSNL Prepaid Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాదంతా వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు మామూలుగా లేవుగా..
రీచార్జ్ చేసుకునేటప్పుడు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మది నెలలు, ఏడాది ప్లాన్లను గమనించి ఉంటారు. ఎక్కువగా నెల, మూడు నెలల ప్లాన్లను వినియోగదారులు ఎంపిక చేసుకుంటారు. అయితే చవకైన ధరల్లో ఏడాది ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఇవి కొత్త ప్లాన్లు కాకపోయినా.. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను విస్తృత పరిచినందున ఈ ప్లాన్లు బాగా ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.

టెలికాం సంస్థల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం ఉంది. దీనిలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి సంస్థలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. చవకైన ధరల్లో మంచి స్పీడ్ తో ఇంటర్ నెట్ తో పాటు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ పోటీలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కాస్త వెనుకబడ్డట్టు కనిపించినా.. దీని వినియోగదారులు బాగానే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ వినియోగిచే వారు అధికంగా కనిపిస్తున్నారు. రీచార్జ్ చేసుకునేటప్పుడు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మది నెలలు, ఏడాది ప్లాన్లను గమనించి ఉంటారు. ఎక్కువగా నెల, మూడు నెలల ప్లాన్లను వినియోగదారులు ఎంపిక చేసుకుంటారు. అయితే చవకైన ధరల్లో ఏడాది ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఇవి కొత్త ప్లాన్లు కాకపోయినా.. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను విస్తృత పరిచినందున ఈ ప్లాన్లు బాగా ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది. మళ్లీ మళ్లీ సిమ్ రీచార్జ్ చేయకుండా లాంగ్ టర్మ్ కోసం ఒకేసారి అది కూడా తక్కువ ఖర్చుతో రీచార్జ్ చేసుకునే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఆ ప్రీ పెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్లాన్ ఇది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 600జీబీ లంప్సమ్ డేటాతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు, ఉచిత పీఆర్బీటీ వంటి ప్రాథమిక ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగదారులకు లోక్‌ధున్ కంటెంట్, ఇరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ కూడా లభిస్తుంది. ఎఫ్యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా వినియోగం తర్వాత, ఇంటర్ నెట్ వేగం 40 కేబీపీఎస్కి తగ్గుతుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్రీపెయిడ్ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్, 2జీబీ రోజువారీ డేటాతో వస్తుంది. ఎఫ్యూపీ డేటా వినియోగం తర్వాత ఇంటర్ నెట్ వేగం 40కేబీపీఎస్కి పడిపోతుంది. ఇరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను 30 రోజులు, లోక్‌ధున్ 30 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. మనదేశంలో ఉన్న అత్యంత సరసమైన 2జీబీ రోజువారీ డేటా సంవత్సరపు ప్లాన్‌లలో ఇది ఒకటి.
బీఎస్ఎన్ఎల్ రూ. 2,999 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ నుంచి అందుబాటులో ఉన్న మరో ప్లాన్ రూ.2999. ఇది 395 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వాస్తవానికి 13 నెలలు, ఏడాదికి ఒక అదనపు నెల. వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందుతారు. ఇదే ధరకు జియో రోజుకు 2.5జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే ఇది నిజంగా అపరిమిత 5G డేటా ఆఫర్‌తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడిన ఇతర అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు.
ఈ మూడు బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు ఏడాది వ్యాలిడిటీతో వస్తాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ప్లాన్ కూడా ఉంది. ఆ ప్లాన్ ధర రూ.1,499. ఇది 336 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు, 24జీబీ డేటాతో వస్తుంది. 336 రోజులు అంటే 11 నెలలు, దాదాపు ఒక సంవత్సరం వరకు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








