AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌!

Tech Tips: పగటిపూట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి కూడా వేడిగా మారుతుంది. టైర్ లోపల గాలి వేడెక్కి వ్యాకోచించి. ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల టైర్ దెబ్బతిని పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ప్రతి 10°C ఉష్ణోగ్రత పెరుగుదల టైర్ సుమారు 1-2 PSI పెరుగుతుంది..

Tech Tips: వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌!
Subhash Goud
|

Updated on: Apr 28, 2025 | 3:53 PM

Share

వేసవి రోజుల్లో కారు టైర్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం. వేసవిలో టైర్ ప్రెజర్ వేగంగా మారుతుంది. బలమైన సూర్యకాంతి, పెరుగుతున్న ఉష్ణోగ్రత కారు టైర్లను దెబ్బతీస్తాయి. టైర్ ఒత్తిడి పెరుగుదల, తగ్గుదలను మీరు విస్మరిస్తే, టైర్లు దెబ్బతినే అవకాశాలు. అలాగే ప్రమాదాలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల టైర్లను నిర్వహించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

వేసవిలో ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది?

పగటిపూట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి కూడా వేడిగా మారుతుంది. టైర్ లోపల గాలి వేడెక్కి వ్యాకోచించి. ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల టైర్ దెబ్బతిని పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ప్రతి 10°C ఉష్ణోగ్రత పెరుగుదల టైర్ సుమారు 1-2 PSI పెరుగుతుంది. మీ టైర్ ప్రెజర్ సాధారణంగా 25 PSI అయితే, బలమైన సూర్యకాంతిలో అది 30 PSI లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.

వేసవిలో మీ టైర్ ఒత్తిడిని తనిఖీ చేయండి:

వేసవిలో కారు టైర్ల ఒత్తిడిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. దూర ప్రయాణాల సమయంలో తరచుగా టైర్ ఒత్తిడిని తనిఖీ చేయండి. ప్రయాణం ప్రారంభంలో ఒత్తిడిని తనిఖీ చేయండి.

టైర్ల సంరక్షణ తప్పనిసరి:

వేసవి కాలంలో కారును ఓవర్‌లోడ్ చేయకూడదు. ఇది టైర్లపై అదనపు బలాన్ని కలిగిస్తుంది. టైర్ల అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్‌ను ఎప్పటికప్పుడు చేయాలి. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పాత టైర్లను ఉపయోగించడం ప్రయాణానికి ప్రమాదకరం. అందుకే వాటిని త్వరగా మార్చండి.

నైట్రోజన్ వాయువు వాడండి:

వేసవిలో టైర్లలో గాలి నింపేటప్పుడు నైట్రోజన్ వాయువు నింపడం మర్చిపోవద్దు. నైట్రోజన్ ఒక చల్లని వాయువు. ఇది అధిక ఉష్ణోగ్రతలలో టైర్ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది గాలి విస్తరించకుండా నిరోధిస్తుంది. టైర్ పగిలిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

అతివేగాన్ని కంట్రోల్‌ చేయండి:

వేసవి సెలవుల్లో ప్రజలు దూర ప్రయాణాలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో చాలా వేగంగా నడపడం వల్ల సమయం ఆదా అవుతుంది. కానీ అది టైర్లను త్వరగా వేడి చేస్తుంది. అవి పగిలిపోయే అవకాశాలను పెంచుతుంది. ఇది పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. అందుకే కారును మితమైన వేగంతో నడపండి.

విరామం తీసుకోవడం అవసరం:

దూర ప్రయాణాల సమయంలో ప్రతి 100-150 కిలోమీటర్లకు ఒకసారి ఆపివేయండి. తద్వారా మీరు కారుకు విశ్రాంతి ఇవ్వవచ్చు. ఇది టైర్లు, ఇంజిన్ చల్లబరచడానికి సమయం ఇస్తుంది. రెండింటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి