Security Tips: బీకేర్‌ఫుల్.. స్మార్ట్ టీవీ, స్పీకర్స్ మీ రహస్యాలను చూస్తున్నాయి.. ఇలా చెక్ పెట్టండి..!
సైబర్ క్రైమ్.. సైబర్ క్రైమ్.. సైబర్ క్రైమ్.. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కాదేదీ చోరీకి సాదనం అంటూ.. స్మార్ట్ ఫోన్ ద్వారానే కాదు, స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్ ద్వారా కూడా మీ రహస్యాలను తస్కరిస్తున్నారు కేటుగాళ్లు. అంతేకాదు..
సైబర్ క్రైమ్.. సైబర్ క్రైమ్.. సైబర్ క్రైమ్.. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కాదేదీ చోరీకి సాదనం అంటూ.. స్మార్ట్ ఫోన్ ద్వారానే కాదు, స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్ ద్వారా కూడా మీ రహస్యాలను తస్కరిస్తున్నారు కేటుగాళ్లు. అంతేకాదు.. వీటిసాయంతో మీ బెడ్‌రూమ్‌లో మీరేం చేస్తున్నారో కూడా చూసేస్తున్నారు. అందుకే అలర్ట్. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్ ఉంటే తప్పక జాగ్రత్త వహించండి. ఇంతకాలం స్మార్ట్ ఫోన్ వల్లే ప్రైవసీకి, భద్రతకు ముప్పు అనుకుంటున్నాం. కానీ, స్మార్ట్ టీవీలు, స్పీకర్లు కూడా నట్టేట ముంచేస్తున్నాయి. అందరిపై నిఘా పెడుతున్నాయి.
వాస్తవానికి ఏదైనా స్మార్ట్ డివైజ్ వినియోగించాలంటే.. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ తప్పనిసరి ఉంటుంది. అదే ప్రజల భద్రత, గోప్యతను ప్రమాదంలో పడేస్తుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మన పర్సనల్ విషయాలు, వివరాలు తస్కరణకు గురవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ టీవీలో ప్రైవసీ డేంజర్..
కొన్ని స్మార్ట్ టీవీలకు కెమెరాలు, మైక్రో ఫోన్స్ ఉంటాయి. ఇవి మీ వాయిస్, ముఖాన్ని గుర్తించడానికి వీలుగా ఉండే ఫీచర్లతో వస్తాయి. అయితే, వీటిని హ్యాకర్లు ఈజీగా యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. దీని కారణంగా మీ ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. స్మార్ట్ స్పీకర్లు కూడా మీపై గూఢచర్యం చేస్తాయి.
స్మార్ట్ స్పీకర్స్..
అధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్ 2017లో గూగుల్ తన ‘గూగుల్ హోమ్’ మినీ స్మార్ట్ స్పీకర్‌లో చిన్న లోపం కారణంగా వినియోగదారుల సంభాషణలను వారికి తెలియకుండానే రికార్డ్ చేస్తోందని గుర్తించారు. కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో బగ్‌ను పరిష్కరించినప్పటికీ.. గూగుల్ హోమ్ మినీ, ఇతర స్మార్ట్ స్పీకర్ల నుంచి గోప్యతకు ముప్పు తప్పిందని కన్ఫామ్‌గా చెప్పడం లేదు.
హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడం ఎలా?
స్మార్ట్ టీవీ..
టీవీల్లో సెట్టింగ్స్ భిన్నంగా ఉంటాయి. ప్రతి టీవీ ఫీచర్ వేరు వేరుగా ఉంటాయి. అయితే, కొన్ని సెట్టింగ్స్ ఛేంజ్ చేయడం ద్వారా ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఎల్‌జీ టీవీ తీసుకుంటే.. ఎల్‌జీ ఏసీఆర్ టెక్నాలజీ లైవ్‌ప్లస్ అనే పేరుతో సరికొత్త WebOS ఆధారిత స్మార్ట్ టీవీలలో ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. దీన్ని ఆఫ్ చేయడానికి సెట్టింగ్స్‌కి వెళ్లాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ > ఆల్ సెట్టింగ్స్ > లైవ్‌ప్లస్ > ఆఫ్ చేయాలి.
ఎల్‌జీ స్మార్ట్ టీవీలో డేటా సేకరణ, యూజింగ్‌ను పరిమితం చేయడానికి సెట్టింగ్స్ > ఆల్ సెట్టింగ్స్ > జనరల్ > అబౌట్ టీవీ > కస్టమర్ అగ్రిమెంట్స్ కిందకు స్క్రోల్ చేయాలి. పర్సనలైజ్‌డ్ యాడ్స్ బటన్ ఆఫ్ చేయాలి.
శాంసంగ్ విషయానికి వస్తే.. సెట్టింగ్స్‌కి వెళ్లాలి. ఆ తరువాత స్మార్ట్ హబ్ పాలసీపై క్లిక్ చేయాలి. అక్కడ అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు సింక్ ప్లస్ అండ్ మార్కెటింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ఆఫ్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్మార్ట్ ఫోన్..
స్మార్ట్‌ఫోన్‌కు తప్పనిసరిగా పాస్‌వర్డ్ ఉండాలి. అపరిచిత వ్యక్తులకు మీ ఫోన్‌ను ఇవ్వకూడదు. పబ్లిక్ వైఫైని ఉపయోగించాలి. ఏదైనా యాప్‌ని రన్ చేసే ముందు.. అది మీకు సంబంధించిన ఎలాంటి వివరాలను సేకరిస్తుందో చెక్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోవద్దు.
స్మార్ట్ స్పీకర్స్..
అవసరం లేనప్పుడు స్పీకర్ల మైక్రోఫోన్‌లను మ్యూట్ చేయాలి. స్మార్ట్ స్పీకర్స్‌లలో కమాండ్‌తో ఆన్ చేయగల ఫిజికల్ స్విచ్ ఆప్షన్‌ను పొందుతారు. అలాగే కమాండ్ హిస్టరీని ఎప్పటికప్పుడు తొలగించాలి. టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ప్రారంభించాలి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్ నుంచి అనవసరమైన పరికరాలను డిస్‌కనెక్ట్ చేయాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..