AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Smartphone: వివో నుంచి కొత్త ఫోన్.. ఏకంగా 16జీబీ ర్యామ్.. ఫీచర్లు సూపరంతే.. ధర అందుబాటులోనే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇప్పుడు సరికొత్త 4జీ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు వివో వై36 4జీ. దీనిలో ఏకంగా 16జీబీ ర్యామ్ ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.

Vivo Smartphone: వివో నుంచి కొత్త ఫోన్.. ఏకంగా 16జీబీ ర్యామ్.. ఫీచర్లు సూపరంతే.. ధర అందుబాటులోనే..
Vivo Y36 4g
Madhu
|

Updated on: Jun 23, 2023 | 3:00 PM

Share

ప్రస్తుతం 5జీ ట్రెండ్ మొదలైంది. అయినప్పటికీ 4జీ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది. ఇప్పటికే 4జీ వేరియంట్ ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇప్పుడు సరికొత్త 4జీ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు వివో వై36 4జీ. దీనిలో ఏకంగా 16జీబీ ర్యామ్ ఉంటుంది. గ్లాస్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో వై36 స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.64 ఇంచుల స్క్రీన్, పంచ్ హోల్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, మరో 8జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉండనుంది. అంటే యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభించనుంది. 256 జీబీ మెమరీ ఉంటుంది. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఫన్‌టచ్ ఓఎస్ 13పై ఈ స్మార్ట్‌ఫోన్ పని చేస్తుంది.

వివో వై36 ఫీచర్లు ఇవి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ ఐపీ 54 రేటింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.1, 1 టీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే ఫీచర్ల పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదిరే స్పెసిఫికేషన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

ఇవి కూడా చదవండి

వివో వై36 ధర, లభ్యత..

వివో వై36 డివైజ్ భారతదేశంలో రూ.16,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్ మెమరీ వేరియంట్‌లో మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. ఇది అన్ని వివో ఈ స్టోర్లలో లభ్యమవుతోంది. మెటోర్ బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వచ్చింది. కొనుగోలు దారులు ఐసీఐసీఐ బ్యాంక్,హెచ్డీ ఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 500 తక్షణ తగ్గింపును పొందుతారు. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంది. అలాగే కంపెనీ నో కాస్ట్ ఈఎంఐ, అలాగే 15 డే స్ రిప్లేస్ మెంట్ పాలసీ కూడా ఇస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్