Honor PAD X8: హానర్ నుంచి చవకైన ట్యాబ్లెట్.. రూ. 10వేల లోపు ధరలో సూపర్ ఫీచర్లు..
ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హానర్ ఓ కొత్త ట్యాబ్లెట్ ను మన దేశంలో లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ ఎక్స్8 ట్యాబ్లెట్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిని ప్రముఖ ఈ-ప్లాట్ ఫారం అమెజాన్లో సేల్ కి ఉంచింది.
మీరు ఏదైనా ట్యాబ్లెట్ కొనాలని భావిస్తున్నారా? అది కూడా ఎక్కువ బడ్జెట్ కాకుండా కేవలం రూ. 10,000లోపు బడ్జెట్లో తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ హానర్ ఓ కొత్త ట్యాబ్లెట్ ను మన దేశంలో లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ ఎక్స్8 ట్యాబ్లెట్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిని ప్రముఖ ఈ-ప్లాట్ ఫారం అమెజాన్లో సేల్ కి ఉంచింది. ఈ హానర్ ప్యాడ్ ఎక్స్8 3జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్ టర్నల్ మెమరీ వేరియంట్ ఇప్పటికే అమెజాన్ సేల్ లో ఉండగా.. ఇప్పుడు 4జీబీ ర్యామ్, 32జీబీ మెమరీ వేరియంట్ ని కూడా అమ్మకానికి పెట్టింది. ఈ కొత్త ట్యాబ్లెట్ లో 10.1 అంగుళాల డిస్ ప్లే, హీలియో జీ80 ప్రాసెసర్, 5,100ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హానర్ ప్యాడ్ ఎక్స్8 స్పెసిఫికేషన్లు..
దీనిలో 10.1 అంగుళాల ఎల్సీడీ ఐపీఎస్ ఫుల్ హెచ్ డీ స్క్రీన్ 1,920 x 1,200 పిక్సెల్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది 16.7 మిలియన్ కలర్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. బ్లూ లైట్ ప్రోటెక్షన్ ఉంటుంది. అలాగే ఈ-బుక్ సౌకర్యం కూడా ఈ ట్యాబ్లెట్లో ఉంటుంది.
హానర్ ప్యాడ్ ఎక్స్8 సామర్థ్యం ఇది..
ఈ ట్యాబ్లెట్ ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జీ80 చిప్ సెట్, మాలి జీ53 గ్రాఫిక్స్ తో వస్తుంది, దీనిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్ + 32జీబీ మెమరీ, 4జీబీ ర్యామ్+ 64జీబీ మెమరీతో ఉంటుంది. మెమరీని 512జీబీ వరకూ ఎక్స్ టర్నల్ మెమరీ కార్డుతో పెంచుకోవచ్చు. ఇది మ్యాజిక్ యూఐ 6.1 ఆధారితమైన ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తోంది. అలాగే దీనిలో బ్యాటరీ 5100ఎంఏహెచ్ ఉంటుంది. 14 గంటల వరకూ నాన్ స్టాప్ గా పనిచేస్తుంది. అలాగే దీనిలో వెనుకవైపు 5ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై, బ్లూటూత్ 5.1,యూఎస్బీ పోర్టు ఉంటుంది.
హానర్ ప్యాడ్ ఎక్స్8 ధర, లభ్యత..
ఇది బ్లూ అవర్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 9,999కాగా 4జీబీ ర్యామ్ + 64జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. ఈ 4జీబీ వేరియంట్ తో పాటు ఫ్రీ ఫ్లిప్ కవర్ ఉచితంగా పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..