Smart Phone: మరో నయా ఫోన్ రిలీజ్ చేసిన సామ్‌సంగ్.. ఫీచర్స్ తెలిస్తే అదిరిపోతారంతే
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ సామ్‌సంగ్ రిలీజ్ చేసే ఎం సిరీస్ ఫోన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తాజాగా ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎం-36 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను సామ్‌సంగ్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం-35కు అప్‌డేడ్ వెర్షన్‌గా ఏఐ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం-36 గురించి కీలక సమాచారం తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో త్వరలోనే కొత్త ఫోన్ గెలాక్సీ ఎం-36 సందడి చేయనుంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో ఎక్సినోస్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అంతే కాకుండా గెలాక్సీ ఏఐ ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామని సామ్‌సంగ్ కంపెనీ ప్రకటించింది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు వన్ యూఐ 7 వెర్షన్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 22,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూలై 12 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం-36 5జీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 6.7 అంగుళాల సూపర్ ఎమోఎల్ఈడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ ఫోన్‌లోని స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్‌ను పొందుతుంది. అలాగే ఈ ఫోన్ కేవలం 7.7 ఎంఎం థిక్‌నెస్‌తో రావడం వల్ల మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని సామ్‌సంగ్ కంపెనీ ప్రకటించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే ట్రిపుల్ రియర్ సెటప్‌తో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌లో ఏఐ సెలెక్ట్, ట్రాన్స్లేషన్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా అందిస్తోంది. గూగుల్ సర్కిల్ సెర్చ్, జెమినీ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ఫోన్‌లో కంపెనీ ఎలాంటి అడాప్టర్‌ను అందించదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








