AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best smart watches: మణికట్టుకు అందం.. మనిషికి ఆరోగ్యం.. లేటెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌లు

ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. సమయం చూసుకోవడంతో పాటు అనేక ప్రయోజనాలు వీటి వల్ల కలుగుతున్నాయి. ఆరోగ్య పర్యవేక్షణ, గుండె స్పందన రేటు, బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్, నావిగేషన్, బెస్ట్ బ్యాటరీ తదితర ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. పురుషులు, మహిళలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకూ అనేక రకాల పనులను చాలా సులభంగా చేసుకునే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మినీ స్మార్ట్ ఫోన్లుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలున్నాయి కదా, ధర ఎక్కువగా ఉంటుందని భయపడవద్దు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో అతి తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Jul 01, 2025 | 4:30 PM

Share
బోట్ నుంచి విడుదలైన వేవ్ సిగ్మా 3 స్టార్ స్మార్ట్ వాచ్ స్లైలిష్ లుక్ తో అదరగొడుతోంది. పురుషులతో పాటు మహిళలు కూడా దీన్ని ధరించవచ్చు. నావిగేషన్, ఆరోగ్య పర్యవేక్షణ, ఫిట్ నెస్ ట్రాకింగ్ తదితర అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని క్యూార్ ట్రే ఫీచర్ తో చెల్లింపులను సులభతరం చేస్తుంది. 2.01 అంగుళాల డిస్ ప్లే, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐపీ 67 అసిస్టెంట్, అలారం, టైమ్ డిస్ ప్లే, స్టాప్ వాచ్, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్ అడ్వాంటేజ్ తదితర ఫీచర్ల బాగున్నాయి. అమెజాన్ లో ఈ వాచ్ రూ.1299కు అందుబాటులో ఉంది.

1 / 5
బోల్ట్ కొత్తగా విడుదల చేసిన రోవర్ ప్రో స్మార్ట్ వాచ్ అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. దీనిలో 1.43 అమోలెడ్ డిస్ ప్లేలో పగటి పూట కూడా స్పష్టంగా సమయం కనిపిస్తుంది. ఫోన్ కు వచ్చే వివిధ నోటిఫికేషన్లను చక్కగా చూసుకోవచ్చు. స్పీకర్, మైక్రోఫోన్, బ్లూటూత్ 5.2 సింగిల్ చిప్ టెక్నాలజీ కాలింగ్, ఆరోగ్యం పర్యవేక్షణ, గుండె స్పందన రేటు, రక్త ఆక్సిజన్ స్థాయి తనిఖీ, ఐపీ 69 రేటింగ్ దీని ప్రత్యేకతలు. పురుషులతో పాటు మహిళలు కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. అమెజాన్ లో ఈ వాచ్ ను రూ.1,599కు కొనుగోలు చేయవచ్చు.

2 / 5
ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్రాక్ నుంచి విడులైన లిమిట్ లెస్ ఎఫ్ఎస్2 ప్లస్ స్మార్ట్ వాచ్ లో ఫీచర్లు చాలా బాగున్నాయి. రోజు వారీ పనులను చాలా సులభతరం చేసేలా రూపొందించారు. తేలికైన డిజైన్ తో ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అల్ట్రా యూవీ డిస్ ప్లేలో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్ లు, ఐదు రోజుల బ్యాటరీ లైఫ్, ఏఐ బ్యాక్ట్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, అంతర్నిర్మిత గేమ్ లు బాగున్నాయి. హెల్త్ ట్రాకింగ్, గుండె స్పందన పర్యవేక్షణ. నిద్ర ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. అమెజాన్ లో రూ.1598కి ఈ వాచ్ అందుబాటులో ఉంది.

3 / 5
స్టైల్ తో పాటు మంచి పనితీరు కలిగిన స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకుంటే ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో మ్యాక్స్ సరైన ఎంపిక. రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా చూస్తుంది. 2.01 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, ఆరు గంటలు పనిచేసే లిథియం - అయాన్ బ్యాటరీ, మెటల్ బాడీ డిజైన్, కెమెరా, మ్యాజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ గా ఉండటానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కేవలం రెండు గంటల్లోనే వాచ్ ను చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ రూ.1,299కే అమెజాన్ లో అందుబాటులో ఉంది.

4 / 5
మహిళల మణికట్టుకు అందాన్నిచ్చే స్మార్ట్ వాచ్ లలో నాయిస్ పల్స్ 2 మ్యాక్స్ ముందు వరసలో ఉంటుంది. మంచి బ్యాటరీ లైఫ్, ధీర్ఘకాలిక పనితీరుతో ఆకట్టుకుంటోంది. 1.85 అంగుళాల డిస్ ప్లే, కర్వ్డ్ గ్లాస్ డిజైన్, 100 స్పోర్ట్స్ మోడ్ లు, ఒత్తిడిని పర్యవేక్షించే హెల్త్ సూట్, మహిళా సైకిల్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ పర్యవేక్షణ దీని ప్రత్యేకతలు. వాచ్ ముఖాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు సెటప్ చేసుకునే వీలు ఉంది. స్లైలిష్ గా ఉండాలని కోరుకునే వారికి చాలా బాగుంటుంది. ఈ వాచ్ ను అమెజాన్ లో రూ.1,999 ధరకు అందుబాటులో ఉంచారు.

5 / 5