Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Plus Community Sale: మరో కొత్త సేల్‌ స్టార్ట్‌ చేసిన వన్‌ప్లస్‌.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.17 వేల వరకూ తగ్గింపు

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర గాడ్జెట్‌ల వంటి వన్‌ప్లస్‌ పరికరాలపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్‌ డిసెంబర్‌ 17 వరకూ సాగనుంది. ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు వినియోగదారులకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. అలాగే కొన్ని మొబైల్స్‌సై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు పాత వన్‌ప్లస్‌ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే మీరు దానిని కొత్త స్మార్ట్‌ఫోన్‌తో మార్చుకోవచ్చు. పైగా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

One Plus Community Sale: మరో కొత్త సేల్‌ స్టార్ట్‌ చేసిన వన్‌ప్లస్‌.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.17 వేల వరకూ తగ్గింపు
Oneplus Sale
Follow us
Srinu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 13, 2023 | 6:46 PM

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ ప్లస్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనిటీ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర గాడ్జెట్‌ల వంటి వన్‌ప్లస్‌ పరికరాలపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్‌ డిసెంబర్‌ 17 వరకూ సాగనుంది. ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు వినియోగదారులకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. అలాగే కొన్ని మొబైల్స్‌సై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు పాత వన్‌ప్లస్‌ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే మీరు దానిని కొత్త స్మార్ట్‌ఫోన్‌తో మార్చుకోవచ్చు. పైగా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వన్‌ప్లస్‌ 10 టీ 

ఈ ఫోన్‌ అసలు ధర రూ. 54,999. అయితే ఈ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ. 12000 తగ్గింపుతో లభిస్తుంది. వన్‌కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ. 5000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

వన్‌ప్లస్‌ 10 ప్రో

8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.66,999గా ఉంది. కమ్యూనిటీ సేల్ సమయంలో, వినియోగదారులు ఈ ఫోన్‌ కేవలం రూ. 44,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. అంటే ఈ ఫోన్‌పై రూ.17000 తగ్గింపుతో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై కూడా వన్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు వినియోగదారులు రూ. 5000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

వన్‌ప్లస్‌ 10 ఆర్‌ 

వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్ సమయంలో ఈ ఫోన్‌ రూ. 7 వేల తగ్గింపుతో వస్తుందిది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌పై రూ. 32,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు కూడా వర్తిస్తుంది.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌

వన్‌ప్లస్‌ ప్యాడ్ రూ. 30,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇందులో బ్యాంక్, ఇతర డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3

వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 22,999 రూపాయల తగ్గింపు ధరతో లభిస్తుంది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2 

ఈ కమ్యూనిటీ సేల్ 2023 సమయంలో వన్‌ప్లస్‌ బడ్స్ ప్రో 2 రూ. 7,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 

ఈ కమ్యూనిటీ సేల్ సందర్భంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ ఈ సేల్‌లో రూ.1599కు లభిస్తుంది.

వన్‌ప్లస్‌ బుల్లెట్‌ జెడ్‌2 వైర్‌లెస్‌ 

ఈ కమ్యూనిటీ సేల్ సమయంలోఈ బుల్లెట్‌ జెడ్‌ వైర్‌లెస్‌ బడ్స్‌ రూ. 1,349 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.