Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asus Chromebook Plus: టాప్‌ ఫీచర్స్‌తో ఆసస్‌ నుంచి నయా ల్యాప్‌టాప్‌.. ఆకర్షిస్తున్న స్లిమ్‌ డిజైన్‌

అనూహ్యంగా పెరిగిన ఈ డిమాండ్‌తో అన్ని కంపెనీలు కొత్తకొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. వినియోగదారులకు తక్కువ ధరకు ల్యాప్‌టాప్స్‌ అందించే సంస్థగా పేరొందిన ఆసస్‌ కంపెనీ తాజాగా సరికొత్త ఫీచర్లతో ఓ కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్‌ చేసింది. ఆసస్‌ క్రోమ్‌ బుక్‌ప్లస్‌ సీఎక్స్‌ 3402 పేరుతో లాంచ్‌ ఈ ల్యాప్‌టాప్‌ కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసకుందాం.

Asus Chromebook Plus: టాప్‌ ఫీచర్స్‌తో ఆసస్‌ నుంచి నయా ల్యాప్‌టాప్‌.. ఆకర్షిస్తున్న స్లిమ్‌ డిజైన్‌
Asus Chromebook Plus
Follow us
Srinu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 13, 2023 | 7:45 PM

ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా మహమ్మారి దెబ్బకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అన్ని కంపెనీలు మొగ్గు చూపడంతో ల్యాప్‌టాప్‌ అవసరం బాగా పెరిగింది. అలాగే  పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌తోనే అవ్వని పనైతే ల్యాప్‌టాప్‌ తప్పనిసరైంది. అనూహ్యంగా పెరిగిన ఈ డిమాండ్‌తో అన్ని కంపెనీలు కొత్తకొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. వినియోగదారులకు తక్కువ ధరకు ల్యాప్‌టాప్స్‌ అందించే సంస్థగా పేరొందిన ఆసస్‌ కంపెనీ తాజాగా సరికొత్త ఫీచర్లతో ఓ కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్‌ చేసింది. ఆసస్‌ క్రోమ్‌ బుక్‌ప్లస్‌ సీఎక్స్‌ 3402 పేరుతో లాంచ్‌ ఈ ల్యాప్‌టాప్‌ కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసకుందాం.

ఆసస్‌ క్రోమ్‌ బుక్‌ప్లస్‌ సీఎక్స్‌ 3402 ల్యాప్‌టాప్‌ ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల స్క్రీన్‌తో 12వ జెనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో లభించే ఈ ల్యాప్‌టాప్‌ పనితీరు విషయంలో కీలకంగా ఉంటుంది. సుధీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌, సూపర్‌ స్టైల్‌ష్‌ డిజైన్‌ ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాస్‌ ఆసన్‌ నుంచి వచ్చిన మొదటి క్రోమ్‌బుక్‌ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

కేవలం 1.4 కేజీల సొగసైన డిజైన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. 180 డిగ్రీల కోణంతో, యాంటీమైక్రోబయల్‌ కోటింగ్‌, స్పిల్‌ రెసిస్టెంట్‌ బ్లాక్‌లీట్‌ కీబోర్డ్‌, ఎంఐఎల్‌-ఎస్‌టీడీ 810 హెచ్‌ మిలటరీ గ్రేడ్‌ డ్యూరబులిటీతో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఐ7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌ 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో యూఎస్‌బీ టైప్‌-సీ చార్జింగ్‌ పోర్ట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫీచర్లతో విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులకు కూడా అనువుగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..