AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme C67 5G: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌..

రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి గురువారం తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఏఐ ఆధారిత డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ను డార్క్‌ పర్పుల్‌, సన్నీ ఒయాసిస్‌ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర...

Realme C67 5G: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌..
Realme C67 5g
Narender Vaitla
|

Updated on: Dec 14, 2023 | 4:17 PM

Share

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో 5జీ ఫోన్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ67 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి గురువారం తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఏఐ ఆధారిత డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ను డార్క్‌ పర్పుల్‌, సన్నీ ఒయాసిస్‌ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999గా నిర్ణయించారు. డిసెంబర్‌ 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 20 తర్వాత ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 1500 డిస్కౌంట్‌ అందించనున్నారు.

ఇక ఈ ఫోన్‌ పూర్తి ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌, 680 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ర్యామ్‌ను 6జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక రియల్‌మీ సీ67 5జీ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 33 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 29 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 7.89 ఎన్‌ఎమ్‌ మందంతో అత్యంత సన్నగా ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశారు. ఐపీ54 రేటింగ్‌ డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను ఇచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!