One Plus: మీరు వన్‌ప్లస్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా.? మీకోసమే లెటెస్ట్ అప్‌డేట్..
ఇలా ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న వన్‌ప్లస్ తాజాగా తమ యూజర్లకు ఓ అప్‌డేట్ ఇచ్చింది. వన్‌ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్సిజన్ ఓఎస్ 14ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లోబల్ యూజర్లందరికీ వన్‌ప్లస్ అధికారికంగా ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ డివైజ్‌లు వాడుతున్న వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఓ ప్రకటనలో....
ప్రపంచ స్మార్ట్ ఫోన్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది వన్‌ప్లస్. మొదట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకున్న వన్‌ప్లస్ తదనంతరం బడ్జెట్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చింది. ప్రస్తుతం అటు ప్రీమియం, ఇటు బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇక కేవలం స్మార్ట్ ఫోన్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ట్యాబ్లెట్స్, వాచ్‌లు, టీవీలు లాంటి అన్ని రకలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను విడుదల చేస్తూ వస్తోంది.
ఇలా ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న వన్‌ప్లస్ తాజాగా తమ యూజర్లకు ఓ అప్‌డేట్ ఇచ్చింది. వన్‌ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్సిజన్ ఓఎస్ 14ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లోబల్ యూజర్లందరికీ వన్‌ప్లస్ అధికారికంగా ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ డివైజ్‌లు వాడుతున్న వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తేలిపింది. ఈ అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజర్లకు మరిన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆక్సిజన్ ఓఎస్ 14ను స్మార్ట్ ఫోన్స్‌కు వేగవంతమైన పనితీరును అందించనున్నాయి. పాత ఆపరేటింగ్ వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఓఎస్ మరింత మెరుగైన పనితీరు, మల్టీ టాస్కింగ్, ఎక్కువ సమయం బ్యాటరీ వచ్చేలా అప్‌డేట్‌లను అందిస్తున్నారు. ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 13తో పోల్చితే, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 14లో అదనంగా 20 నిమిషాల బ్యాటరీ లైఫ్ వస్తుందని వన్‌ప్లస్ కంపెనీ చెబుతోంది.
వన్‌ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే అప్లికేషన్స్‌ను ఏకంగా 72 గంటల వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయవచ్చు. ఈ ఓఎస్‌తో మొబైల్ గేమింగ్ మరింత డెవలప్ చేశారు. ఇక మరింత మెరుగైన గ్రాఫిక్స్, డివైజ్‌లకు సెక్యూరిటీకోసం ట్రస్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్‌మెంట్ (TEE) బేస్డ్ డివైజ్ సెక్యూరిటీ ఇంజన్ 3.0ని అందించారు. ఇక ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజర్లు స్క్రీన్ షాట్‌లు, ఫొటోలు, వీడియోల కోసం సరికొత్త ఆప్షన్స్ పొందొచ్చు.
వీటితో పాటు ఫొటోలను, వీడియోలను ఎడిటింగ్ చేయడానికి స్మార్ట్ కటౌట్ టూల్‌ను సైతం అందించారు. కొత్తగా 11 గ్లోడల్ యూఐ సౌండ్ డివైజ్‌లు, నోటిఫికేషన్స్.. అలారం, కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్స్‌ను జోడించారు. ఇదిలా ఉంటే ఈ కొత్త ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 14 అప్‌డేట్‌ని ప్రస్తుతం కేవలం కొన్ని డివైజ్‌లకు మాత్రమే విడుదల చేస్తున్నారు. విడుదల వారీగా వచ్చే రెండు నెలల్లో అన్ని స్మార్ట్ ఫోన్‌లకు ఈ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..