One Plus Diwali Sale: ఇక వన్‌ప్లస్ వంతు.. వన్‌ప్లస్‌లో కొత్త ఆఫర్ల సందడి.. ఆ ఉత్పత్తులుపై భారీ తగ్గింపు
వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో 2023లో రాబోయే దీపావళి అమ్మకం కోసం టీజర్‌ను విడుదల చేసింది. అయితే విక్రయ తేదీలతో పాటు ఆఫర్ల వివరాలు ప్రస్తుతం తెలుపనప్పటికీ ఈ సేల్‌లో అన్ని ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో ఎక్కువ ప్రజాదరణ పొందిన వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ బడ్స్ ప్రో2, వన్‌ప్లస్ ప్యాడ్ టాబ్లెట్ వంటివి కొనుగోలుకు సిద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ నోర్డ్ వాచ్‌తో పాటు వన్‌ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రోపై కూడా మర్ని డీల్స్ ఉంటాయని వివరిస్తున్నారు.

భారతదేశంలోని ఈ కామర్స్ సైట్స్‌లో ప్రస్తుతం ఆఫర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్లు అక్టోబర్ 8 నుంచి ఆఫర్లను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఈ సీజన్‌లో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ అయిన వన్ ప్లస్ వినియోగదారులకు ఉత్తమమైన డీల్‌లు, తగ్గింపులను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో 2023లో రాబోయే దీపావళి అమ్మకం కోసం టీజర్‌ను విడుదల చేసింది. అయితే విక్రయ తేదీలతో పాటు ఆఫర్ల వివరాలు ప్రస్తుతం తెలుపనప్పటికీ ఈ సేల్‌లో అన్ని ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో ఎక్కువ ప్రజాదరణ పొందిన వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ బడ్స్ ప్రో2, వన్‌ప్లస్ ప్యాడ్ టాబ్లెట్ వంటివి కొనుగోలుకు సిద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ నోర్డ్ వాచ్‌తో పాటు వన్‌ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రోపై కూడా మర్ని డీల్స్ ఉంటాయని వివరిస్తున్నారు. కాబట్టి ఈ సేల్‌లో ఏయే ఉత్పత్తులపై తగ్గింపులు అందిస్తారో? ఓ సారి తెలుసుకుందాం.
ఇప్పటికే వినియోగదారులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 3, 2023 వరకూ ఈ సేల్‌కు సంబంధించిన వివిధ గేమ్స్‌లో పాల్గొన్నారు. అలాగే వన్‌ప్లస్ అక్టోబర్ 7న డీల్స్ అన్‌లాకింగ్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ డీల్స్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు తమ ఉత్పత్తులను పొడిగించిన 18 నెలల ఈఎంఐల ఎంపికల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎంపిక చేసిన మోడల్స్‌లో కాంప్లిమెంటరీ యాక్సెసరీలతో పాటు వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌తో ఉచిత బడ్స్ జెడ్2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌లను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ రూ. 49,999 (బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి)కు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అదనంగా రూ.4000 కూపన్ కోడ్ ద్వారా కూడా తగ్గింపును పొందవచ్చు.
నార్డ్ ప్రొడెక్ట్స్‌పై కూడా తగ్గింపులు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ-3 లైట్ 5 జీతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ రూ.17,499 కు అందుబాటులో ఉంటుంది. అలాగే వన్ ప్లస్ నార్డ్ 3 5 జీ రూ. 28,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఉత్పత్తులపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే టీడబ్ల్యూఎస్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌ల లైనప్‌పై తగ్గింపులను కూడా అందిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 రూ.7,999, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 రూ.2,299కు కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్ రూ.1,349కు అందుబాటులో ఉన్నాయి. అలాగే వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ రూ.599కు కొనుగోలు చేయవచ్చు.
ట్యాబ్స్‌పై కూడా ఆఫర్లు
వన్‌ప్లస్ కొత్తగా ప్రారంభించిన టాబ్లెట్‌పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. వన్ ప్లస్ ప్యాడ్ ప్రారంభ ధర రూ. 36,999 (బ్యాంకు ఆఫర్‌లతో సహా), అలాగే వన్‌ప్లస్ ప్యాడ్ గోను శుక్రవారం లాంచ్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ప్రస్తుత సేల్‌లో రూ.4999కు కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్‌ప్లస్ టీవీ ప్రియులు వన్‌ప్లస్ టీవీ 65 క్యూ2 టీవీ రూ.94,999కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.