One Plus 10 R: వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఐదు వేలకే వన్‌ప్లస్‌ 10 ఆర్‌.. కానీ.. వారికి మాత్రమే..!

ఇటీవల కాలంలో కొన్ని మోడల్స్‌ వన్‌ప్లస్‌ ఫోన్‌ యూజర్లు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వారి ఫోన్‌ స్క్రీన్‌ గ్రీన్‌ కలర్‌లో మారిపోతుంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టీ,  వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ఫోన్స్‌ ఈ సమస్య బాగా వేధిస్తుంది. దీంతో యూజర్లు సోషల్‌మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరట కల్పిస్తూ వన్‌ ప్లస్‌ కంపెనీ కీలక ప్రకటన చేసింది.

One Plus 10 R: వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఐదు వేలకే వన్‌ప్లస్‌ 10 ఆర్‌.. కానీ.. వారికి మాత్రమే..!
Oneplus 10r
Follow us
Srinu

|

Updated on: Aug 13, 2023 | 8:00 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. చాలా మంది ధరతో సంబంధం లేకుండా అధిక ఫీచర్లు ఉన్న ఫోన్లను వాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఐఫోన్‌ వాడడానికి ముందుకు వచ్చారు. అయితే ఐఫోన​ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొంచెం కొత్తగా ఉండడంతో పాటు ముందుగానే అలవాటుపడిన ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఉన్న ప్రీమియం ఫోన్లను వాడుతున్నారు. అలాంటి వారు అందుబాటు ధరలో ఉన్న వన్‌ప్లస్‌ వాడుతున్నారు. వన్‌ప్లస్‌ కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బోలెడన్ని మోడల్స్‌లో ఫోన్లను రిలీజ్‌ చేసింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని మోడల్స్‌ వన్‌ప్లస్‌ ఫోన్‌ యూజర్లు ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వారి ఫోన్‌ స్క్రీన్‌ గ్రీన్‌ కలర్‌లో మారిపోతుంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టీ,  వన్‌ప్లస్‌ 9 ఆర్‌ ఫోన్స్‌ ఈ సమస్య బాగా వేధిస్తుంది. దీంతో యూజర్లు సోషల్‌మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నవారికి ఊరట కల్పిస్తూ వన్‌ ప్లస్‌ కంపెనీ కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌ స్క్రీన్‌ సమస్య వచ్చిన ఫోన్లకు జీవిత కాల వారెంటీ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. 

వన్‌ప్లస్‌ గ్రీన్-స్క్రీన్ సమస్యతో ప్రభావితమైన వినియోగదారులకు జీవితకాల వారెంటీని ప్రకటించింది. ఈ వారెంటీ అన్ని మోడళ్లను కవర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8 టి, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్‌తో సహా పాత వన్‌ప్లస్ పరికరాల్లో ఈ సమస్యను పరిష్కరించడానికి విడి భాగాలు లేనందున సమస్యను పరిష్కరించడం కుదరదు. అయితే వినియోగదాఉలు వారి పాత పరికరాన్ని కొత్త వన్‌ప్లస్‌ పరికరానికి అంటే ప్రత్యేకించి వన్‌ ప్లస్‌ 10ఆర్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 30,000 వరకు తగ్గింపు వోచర్‌ను వాగ్దానం చేస్తోంది. దీని అర్థం వినియోగదారులు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు చెల్లించి కొత్త వన్‌ ప్లస్‌ 10ఆర్‌ని కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ జీవితకాల వారెంటీ భారతదేశంలోని వినియోగదారులకు మాత్రమే పొడిగించారు. ఈ సమస్య ప్రభావిత వినియోగదారులకు చాలా అసౌకర్యాన్ని కలిగించిందని అందువల్లే తామూ ఈ కొత్త ఆఫర్‌ను పెడుతున్నట్లు వన్‌ప్లస్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ఈ సమస్య ఉన్న వినియోగదారులను సమీప వన్‌ప్లస్‌ స్టోర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. పరికర నిర్ధారణ కోసం కేంద్రం, మేము పరిస్థితి కారణంగా ప్రభావితమైన అన్ని పరికరాలకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తారు. ఎంపిక చేసిన వన్‌ప్లస్‌ 8, 9 సిరీస్ పరికరాల్లో అప్‌గ్రేడ్ చేయడానికి పరికర విలువలో సరసమైన శాతాన్ని వినియోగదారుకు అందించే వోచర్‌ను అందిస్తారు. ముఖ్యంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్న మోడల్స్‌కు జీవితకాలం పాటు ఈ సమస్య వస్తే అందుకు అనుగుణంగా వోచర్‌ను కంపెనీ ఇస్తుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి