Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం రోజున వాట్సాప్‌లో స్పెషల్ స్టికర్స్‌తో విషెస్… డౌన్‌లోడ్ చేయడం చాలా సింపుల్..
ప్రస్తుత రోజుల్లో మారుతున్న టెక్నాలజీ ప్రకారం వాట్సాప్ వినియోగం పెరిగింది. గతంలో శుభాకాంక్షలు ఉత్తరాల ద్వారా తెలుపుకుంటే ప్రస్తుతం సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే వాట్సాప్‌లో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం యానిమేటెడ్ చిత్రాలతో శుభాకాంక్షలు తెలుపుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. అయితే వీటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో? కొంతమందికే తెలుసు.
స్వాతంత్య్ర దినోత్సవం అంటే భారతీయులకు ఓ పండుగ రోజు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనను పోరాటాలతో అంతమొందించి 1947 ఆగస్టు 15న భారతదేశ ప్రజలు స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామారాజ్యాన్ని ఎంతో మంది వీరులు తమ వీరోచిత పోరాటాలతో గడగడలాడించారు. అందువల్ల భారతీయులందరూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా చేసుకుంటారు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న టెక్నాలజీ ప్రకారం వాట్సాప్ వినియోగం పెరిగింది. గతంలో శుభాకాంక్షలు ఉత్తరాల ద్వారా తెలుపుకుంటే ప్రస్తుతం సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే వాట్సాప్‌లో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం యానిమేటెడ్ చిత్రాలతో శుభాకాంక్షలు తెలుపుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. అయితే వీటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో? కొంతమందికే తెలుసు. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అనేక థర్డ్-పార్టీ స్టిక్కర్ అప్లికేషన్‌ల మధ్య, మీరు మీ స్నేహితులకు మీకు ఇష్టమైన స్టిక్కర్‌లను ఎలా పంపాలో ఎంచుకోవచ్చు.కాబట్టి ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపడానికి యానిమేటెడ్ స్టిక్కర్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
- స్టెప్-1: మొదటగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి మీకు ఇష్టమైన స్టిక్కర్ అప్లికేషన్ కోసం వెతకాలి.
- స్టెప్-2: ఆ అప్లికేషన్‌ను మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ప్రారంభించాలి. దీన్ని స్క్రీన్ పైభాగంలో ఉంచాక స్వాతంత్య్ర దినోత్సవ స్టిక్కర్ ప్యాక్‌లను మీరు గమనించవచ్చు.
- స్టెప్-3: మీరు ప్రతి స్టిక్కర్ ప్యాక్‌ని నొక్కడం ద్వారా దానిలోని స్టిక్కర్లను వీక్షించవచ్చు.
- స్టెప్-4: మీరు స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకున్నప్పుడు, “వాట్సాప్‌కు జోడించు” నొక్కాలి. లేకపోతే ప్రధాన స్క్రీన్‌పై స్టిక్కర్ ప్యాక్‌కి కుడి వైపున ఉన్న “జోడించు” బటన్‌ను ఉపయోగించాలి.
- స్టెప్-5: మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్‌లో వాట్సాప్ చిహ్నాన్ని ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకుని ఆపై మరోసారి యాడ్ బటన్‌ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే మీ వాట్సాప్ స్టిక్కర్ విభాగంలో స్టిక్కర్ ప్యాక్ కనిపించేలా చేస్తుంది.