Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Transfer Whatsapp Chats: వాట్సాప్‌లో మరో ఇంట్రస్టింగ్‌ ఫీచర్‌.. క్యూఆర్‌ కోడ్‌తో పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌లోకి చాట్స్‌ బదిలీ

ముఖ్యంగా చాటింగ్స్‌ చేసుకోవడమే కాక ఫొటోలు, వీడియోలు పంపిచడంతో పాటు, ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడానికి వాట్సాప్‌ కూడా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందిస్తుంది. తాజా వాట్సాప్‌ ఓ కొత్త అప్‌డేట్‌తో వస్తుంది.

Transfer Whatsapp Chats: వాట్సాప్‌లో మరో ఇంట్రస్టింగ్‌ ఫీచర్‌.. క్యూఆర్‌ కోడ్‌తో పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌లోకి చాట్స్‌ బదిలీ
Whatsapp
Follow us
Srinu

|

Updated on: Jul 04, 2023 | 9:00 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తుంది. స్మార్ట్‌ఫోన్లో వచ్చే వివిధ యాప్స్‌ ద్వారా యువత ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ యాప్స్‌లో ఎక్కువగా వాట్సాప్‌ ఇటీవల కాలంలో యువత ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా చాటింగ్స్‌ చేసుకోవడమే కాక ఫొటోలు, వీడియోలు పంపిచడంతో పాటు, ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడానికి వాట్సాప్‌ కూడా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందిస్తుంది. తాజాగా వాట్సాప్‌ ఓ కొత్త అప్‌డేట్‌తో వస్తుంది. ఇది వినియోగదారులు తమ చాట్ చరిత్రను అదే ఆపరేటింగ్ సిస్టమ్‌లోని పరికరాల మధ్య బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. మీరు మీ వాట్సాప్ చాట్‌లను కొత్త ఫోన్‌కి తరలించాలనుకుంటే మీ చాట్‌లు మీ డివైజ్‌లను వదలకుండా ఇప్పుడు మరింత ప్రైవేట్‌గా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ తాజా అప్‌డేట్‌ గురించి ఓ సారి తెలుసుకుందాం.

మెటా ప్రతినిధులు చెబుతున్న ప్రకారం ఈ ఫీచర్‌తో స్పష్టమైన గోప్యతా పద్ధతులు లేని అనధికారిక మూడవ పక్ష యాప్‌లను ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. అలాగే చాట్ చరిత్ర బదిలీ ప్రక్రియ క్యూఆర్‌ కోడ్‌తో ద్వారా ప్రామాణీకరించుకోవచ్చు. అలాగే డేటా కూడా రెండు పరికరాల మధ్య మాత్రమే భాగస్వామ్యం అవుతుంది. అలాగే బదిలీ సమయంలో పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. చాట్ హిస్టరీని బ్యాకప్ చేయడం, రీస్టోర్ చేయడం కంటే ఈ ప్రక్రియ వేగవంతమైనదని మెటా ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినియోగదారులు పెద్ద మీడియా ఫైల్‌లు, జోడింపులను కూడా బదిలీ చేయవచ్చు. చాట్ చరిత్ర బదిలీ ప్రక్రియను ప్రారంభించే ముందు రెండు పరికరాలు ఒకే వైఫైకు కనెక్ట్ అవ్వాలి. అలాగే పాత ఫోన్‌లో సెట్టింగ్‌లోకి వెళ్లి చాట్‌ల్లోకి వెళ్లి చాట్ బదిలీకి వెళ్లి, మీ కొత్త ఫోన్‌తో స్క్రీన్‌పై ప్రదర్శించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయాలి. అంతే చాలా సింపుల్‌గా మీ చాట్స్‌ను బదిలీ చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..