Whatsapp Update: వాట్సాప్‌లో ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఇకపై సింపుల్‌గా వీడియో సందేశాలు పంపేయచ్చు..

వాట్సాప్ వినియోగదారులు త్వరలో వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో సందేశాలను పంపగలిగేలా సరికొత్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వివిధ నివేదిక ప్రకారం వాట్సాప్‌లో వారి కాంటాక్ట్స్‌తో పంచుకునేందుకు 60 సెకన్ల వరకు చిన్న వీడియోలను పంపడానికి అనుమతిస్తూ కొత్త అప్‌డేట్ రానుంది.

Whatsapp Update: వాట్సాప్‌లో ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఇకపై సింపుల్‌గా వీడియో సందేశాలు పంపేయచ్చు..
Whatsapp
Follow us
Srinu

|

Updated on: Jun 16, 2023 | 5:30 PM

యువత ఎక్కువగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ పరిమితమైన ఫోన్లు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు అవే ప్రత్యామ్నాయంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్స్‌లో కచ్చితంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మెసెజ్‌లను మాత్రమే కాకుండా ఆడియో, వీడియో ఫైల్స్‌తో పాటు యూపీఐ సహాయంతో పేమెంట్ చేసే సౌలభ్యం కూడా ఉంది. అయితే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో మన ముందుకు వస్తుంది. వాట్సాప్ వినియోగదారులు త్వరలో వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో సందేశాలను పంపగలిగేలా సరికొత్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వివిధ నివేదిక ప్రకారం వాట్సాప్‌లో వారి కాంటాక్ట్స్‌తో పంచుకునేందుకు 60 సెకన్ల వరకు చిన్న వీడియోలను పంపడానికి అనుమతిస్తూ కొత్త అప్‌డేట్ రానుంది. అయితే ఈ ఫీచర్ ఐఓఎస్‌తో పాటు, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం.

వాట్సాప్ ద్వారా కొత్త వీడియో సందేశాలను పంపే సామర్థ్యం స్క్రీన్ దిగువన ఉన్న చాట్ బార్‌లో ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది యాడాన్ బటన్‌లు, కెమెరా, వాట్సాప్ పే చిహ్నం పక్కన ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉన్న తరుణంలో కేవలం కొందరికి మాత్రముే అందుబాటులో ఉంటుంది.  ఏదైనా సంభాషణలో చాట్ బార్‌లోని మైక్రోఫోన్ బటన్‌ను నొక్కడం ద్వారా ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి వచ్చిందో? లేదో? తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో షార్ట్ వీడియోలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. టిక్ టాక్ రాకతో ఈ షార్ట్ వీడియోల ట్రెండ్ మరింత పెరిగింది. అయితే అనుహ్యంగా భారత్‌లో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో యూ ట్యూబ్, ఇన్‌స్టాల్లో షార్ట్ వీడియోలు పెరిగాయి. తాజాగా వాట్సాప్ కూడా షార్ట్ వీడియో సందేశాల పంపేలా అప్‌డేట్ ఇచ్చింది. కేవలం 60 సెకన్ల వీడియో ద్వారా ఇతరులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ కొత్త అప్‌డేట్ ఉంటుందని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ అప్‌డేట్ చేసిన వారిలో కొంతమందికే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..