AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Big TV Days: సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ సేల్స్ షురూ.. ఆ టీవీలపై ఏకంగా రూ.20,000 క్యాష్‌బ్యాక్

భారతదేశంలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ తక్కువ ధరల్లోనే స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్స్ ద్వారా వినియోగదారులకు చేరువ అవుతుంది. తాజాగా సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ పేరుతో మన ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో టీవీలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేయడంతో పాటు ప్రత్యేకంగా అదనపు క్యాష్‌బ్యాక్‌లను సైతం అందిస్తుంది.

Samsung Big TV Days: సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ సేల్స్ షురూ.. ఆ టీవీలపై ఏకంగా రూ.20,000 క్యాష్‌బ్యాక్
Samsung 4k Tv
Nikhil
|

Updated on: Jun 16, 2023 | 6:00 PM

Share

భారతదేశంలో సామ్‌సంగ్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి గృహోపకరణాల వరకూ సామ్‌సంగ్ ఉత్పత్తులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే సామ్‌సంగ్ టీవీలను పట్టణ ప్రాంతాల నుంచే గ్రామీణులు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టీవీలు కూడా స్మార్ట్‌గా మారాయి. సాంప్రదాయం పద్ధుతుల్లో కాకుండా టీవీలు స్మార్ట్‌గా మారడంతో పాటు మెరుగైన పిక్చర్ క్వాలిటీతో వస్తున్నాయి. స్మార్ట్ టీవీల మార్కెట్ విషయానికి వస్తే సామ్‌సంగ్ తన మార్క్‌ను చూపిస్తుంది. భారతదేశంలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ తక్కువ ధరల్లోనే స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్స్ ద్వారా వినియోగదారులకు చేరువ అవుతుంది. తాజాగా సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ పేరుతో మన ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో టీవీలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేయడంతో పాటు ప్రత్యేకంగా అదనపు క్యాష్‌బ్యాక్‌లను సైతం అందిస్తుంది. ఈ సేల్ జూలై 25 వరకూ ఉంటుంది. కాబట్టి సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ సేల్‌లో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా  నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ, క్యూ ఎల్ఈడీ, ఓఎల్ఈడీ, ది ఫ్రేమ్, క్రిస్టల్ 4 కే యూహెచ్‌డీ టీవీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు సులభ ఈఎంఐ పథకాలతో పాటు గరిష్టంగా రూ.20,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు . అదనంగా, వారు ఎంపిక చేసిన పెద్ద స్క్రీన్ టెలివిజన్‌లను కొనుగోలు చేస్తే రూ.1,24,999 విలువైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా (12/256 జీబీవేరియంట్), రూ.69,990 విలువైన ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, రూ.51,990 విలువైన సౌండ్‌బార్ వంటి హామీ ఇవ్వబడిన బహుమతులు పొందుతారు. ఈ ఆఫర్‌లు భారతదేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లతో పాటు సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

ఆఫర్లు ఇలా

98 అంగుళాల టీవీని సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వినియోగదారులు ఆఫర్ వ్యవధిలో రూ.124,999 (12/256 జీబీ వేరియంట్) విలువైన ఫ్లాగ్‌షిప్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాని ఉచితంగా పొందుతారు . అదేవిధంగా 85 అంగుళాలు, 75 అంగుళాల నియో క్యూఎల్ఈడీ  8 కే టీవీలు, 77 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ, 85 అంగుళాల నియో క్యూ ఎల్ఈడీ క్యూఎల్ఈడీ టీవీలను కొనుగోలు చేసే వారికి రూ.69,990 విలువైన ది ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ లభిస్తుంది. అలాగే 75 అంగుళాల నియో క్యూఎల్ఈడీ 8కే, 4కే టీవీలు 77 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ కొనుగోలుదారులు రూ.51,990 విలువైన హెచ్‌డబ్ల్యూ-ఎస్ 800బీ సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందుతారు . అలాగే 85 అంగుళాల క్రిస్టల్ 4 కే యూహెచ్‌డీ టీవీ, 65 అంగుళా నియో క్యూఎల్ఈడీ 8 కే టీవీలు, 65 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ, 75 అంగుళాల ది ఫ్రేమ్ టీవీ కొనుగోలు చేస్తే వినియోగదారులు రూ.28,990 విలువైన హెచ్‌డబ్ల్యూ-క్యూ 600 బీ సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందుతారు. అలాగే 55 అంగుళాల నియో క్యూ ఎల్ఈడీ టీవీ, 55 అంగుళాల ఓ ఎల్ఈడీ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులు రూ.15,490 విలువైన హెచ్‌డబ్ల్యూ బీ 450 సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!