AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Prepaid Plans: 35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్‌…. రూ.289తో మరెన్నో సదుపాయాలు

పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్‌టెల్ 35 రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చిన మొదటి కంపెనీగా నిలిచింది. ఎయిర్‌టెల్ నుంచి వచ్చే ఈ సరికొత్త ప్లాన్‌ ద్వారా అందించే సూపర్‌ సదుపాయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

Airtel Prepaid Plans: 35 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్‌…. రూ.289తో మరెన్నో సదుపాయాలు
Airtel 5G Plus
Nikhil
|

Updated on: Jul 04, 2023 | 9:30 PM

Share

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఇటీవల 35 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ ప్లాన్‌లు 24 నుంచి 28 రోజుల వాలిడిటీతో వచ్చాయి. అయితే పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్‌టెల్ 35 రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చిన మొదటి కంపెనీగా నిలిచింది. ఎయిర్‌టెల్ నుంచి వచ్చే ఈ సరికొత్త ప్లాన్‌ ద్వారా అందించే సూపర్‌ సదుపాయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

ఎయిర్‌టెల్ రూ. 289 రీఛార్జ్ ప్లాన్‌ను 35 రోజుల చెల్లుబాటుతో ఇటీవల ప్రకటించింది. కస్టమర్‌లకు ఎస్‌ఎంఎస్‌లు, కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలతో వస్తున్నాయి. ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు. ఈ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో వైఫైని కలిగి ఉంటే లేదా నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మాత్రమే రీఛార్జ్ చేస్తే ఈ రూ. 289 ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది.

ఎయిర్‌టెల్‌లో అందుబాటులో ఉన్న చౌకైన ప్లాన్స్‌ ఇవే

ఎయిర్‌టెల్ రూ.19 ప్లాన్

ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్ ధర రూ. 19 గా ఉంది. ధర పరంగా ఇది ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్. ఎయిర్‌టెల్ రూ.19 టాప్ అప్ ప్లాన్ రోజుకు 1 జీబీ డేటాను అందిస్తుంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం. ఎయిర్‌టెల్ నుంచి వచ్చే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కూడా ఒక రోజని మాత్రం గుర్తుంచుకోవాలి. 

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ రూ.29 ప్లాన్

ఎయిర్‌టెల్‌ నుంచి వచ్చే మరో చౌకైన ప్లాన్ ధర రూ. 29. ధర పరంగా ఈ ప్లాన్ చిన్న రీఛార్జ్ కావచ్చు. కేవలం 29 రూపాయల టాప్ అప్ ప్లాన్‌లో 2 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఒక రోజు మాత్రమే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
ధురంధర్ సినిమాను వెనక్కు నెట్టింట రాజా సాబ్..
ధురంధర్ సినిమాను వెనక్కు నెట్టింట రాజా సాబ్..
మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్.. లొంగిపోయిన 63 మంది నక్సలైట్స్!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఎంతంటే
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!