AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Ring: మొన్న బోట్, నేడు నాయిస్‌.. మార్కెట్‌లో మొదలైన స్మార్ట్ రింగ్ ట్రెండ్‌

టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ముఖ్యంగా టెక్‌ గ్యాడ్జెట్స్‌లో రోజుకో కొత్త ప్రొడక్ట్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ బాగా నడించింది. మార్కెట్లో రకరకాల వాచ్‌లు సందడి చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్మార్ట్ రింగ్‌ల....

Smart Ring: మొన్న బోట్, నేడు నాయిస్‌.. మార్కెట్‌లో మొదలైన స్మార్ట్ రింగ్ ట్రెండ్‌
Noise Smart Ring
Narender Vaitla
|

Updated on: Jul 28, 2023 | 6:30 AM

Share

టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ముఖ్యంగా టెక్‌ గ్యాడ్జెట్స్‌లో రోజుకో కొత్త ప్రొడక్ట్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ బాగా నడించింది. మార్కెట్లో రకరకాల వాచ్‌లు సందడి చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్మార్ట్ రింగ్‌ల హడావుడి మొదలైంది. వేలుకు రింగ్ పెట్టుకుంటే చాలు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఫోన్‌లో రికార్డ్‌ చేసుకోవచ్చు. మొన్నటి మొన్న బోట్ తొలి స్మార్ట్ రింగ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో టెక్‌ దిగ్గజం నాయిస్‌ కూడా స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది.

లూనా పేరుతో ఈ స్మార్ట్ రింగ్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్‌కు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్‌ను కంపెనీ ప్రారంభంచింది. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రూ. 2000 చెల్లించి రింగ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. కొనుగోలు సమయంలో రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ రింగ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను అందించారు. టైటానియం బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ రింగ్‌ 3 మిమీ మందంతో వస్తుంది.

ఇక ఈ రింగ్‌ బాడీ టెంపరేచర్‌ను ఎప్పటికప్పడు ట్రాకింగ్ చేస్తుంది. దీంతో పాటు ఎస్‌పీఓ2, స్లీపింగ్ ట్రాకింగ్‌, నాయిస్‌ ఫిట్ యాప్‌కు కనెక్ట్ చేసుకొని యాక్టివిటీ రికార్డ్‌లు, హెల్త్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE 5) ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌ ఐఓఎస్‌ 14, ఆండ్రాయిడ్‌ 6 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ డివైజలకు కనెక్ట్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..