Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sim Card: కొత్త సిమ్ కావాలంటే ఆధార్ కావాల్సిందే.. కీలక నియమాల సవరణ

భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఆధారంగా మారింది. ముఖ్యంగా దేశంలో ఆధార్ ప్రధాన గుర్తింపు కార్డుగా మారింది. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత డేటా రక్షించేందుకు సుప్రీం కోర్టు ప్రతి చోటా ఆధార్ అవసరాన్ని కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని తప్పనిసరి అవసరాల్లో కేంద్రం ఆధార్ తప్పనిసరి చేస్తుంది. తాజాగా దేశంలో కొత్త సిమ్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు.

Sim Card: కొత్త సిమ్ కావాలంటే ఆధార్ కావాల్సిందే.. కీలక నియమాల సవరణ
New Sim Card Rules
Srinu
|

Updated on: Jul 06, 2025 | 3:45 PM

Share

టెలికం మోసాలను అరికట్టడానికి, వినియోగదారులను రక్షించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి ఇటీవల కఠినమైన నియమాలను ప్రవేశపెట్టింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కొత్త సిమ్ జారీ చేయడానికి ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి చేశారు. వినియోగదారులు ప్రస్తుతం తమ ఆధార్‌తో ఎన్ని మొబైల్ నంబర్‌లు లింక్ చేసి ఉన్నాయో? కూడా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇటీవల పెరుగుతున్న మోసాలతో పాటు నకిలీ కాల్స్ కేసులను పరిష్కరించడానికి డీఓటీ సిమ్ జారీ ప్రక్రియను కఠినతరం చేయడమే కాకుండా నకిలీ నంబర్లను నిష్క్రియం చేయడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంది. 

మీ ఆధార్‌ని ఉపయోగించి ఎవరైనా మోసపూరితంగా సిమ్ కార్డు పొందితే అది చాలా ప్రమాదకరం. అలాంటి దుర్వినియోగం మీ గోప్యతను దెబ్బతీస్తుంది. అలాగే మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. మీ ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌ని ఉపయోగించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే మీరు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. అందువల్ల,  మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో? తనిఖీ చేయడం చాలా ఉత్తమం. అలాగే మీకు ఏవైనా అనధికార నంబర్‌లు కనిపిస్తే చర్య తీసుకోవడం చాలా అవసరం.

అనధికార సిమ్‌లను తనిఖీ చేయడం ఇలా

  • సంచార్ సాథీ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.
  • సిటిజన్-సెంట్రిక్ సర్వీసెస్‌కి వెళ్లి టీఏఎఫ్‌సీఓపీ ఎంపికపై క్లిక్ చేయాలి. 
  • మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. అనంతరం ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • మీ నంబర్ ధ్రువీకరణ అయితే మీ ఆధార్‌కు లింక్ చేయబడిన అన్ని మొబైల్ నంబర్‌ల జాబితా కనిపిస్తుంది. 
  • ఇందులో మీకు తెలియని నంబర్లు ఉంటే “నా నంబర్ కాదు” ఎంచుకుని, దానిని డీయాక్టివేషన్ కోసం నివేదించాలి.

అప్రమత్తత చాలా అవసరం

సైబర్ మోసాలు పెరుగుతున్నందున మీ ఆధార్ వాడకాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. చాలా మంది తెలియకుండానే వారి ఆధార్ వివరాలను పంచుకుంటారు. వీటిని దుర్వినియోగం చేయవచ్చు. మీ ఆధార్‌తో లింక్ చేసిన సిమ్‌లను తనిఖీ చేయడం వల్ల గుర్తింపు దొంగతనాన్ని నివారించవచ్చు. అలాగే చట్టపరమైన సమస్యల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ గుర్తింపును కాపాడుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..