Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే..

చాలా మంది బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు. అయితే ఏ ఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ విధిస్తున్నాయో ఎక్కువ మందికి తెలియదు. పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలను అందిస్తున్నాయి. అందులో కొన్ని ప్రధాన బ్యాంకులకు సంబంధించిన వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్‌ ఇచ్చే బ్యాంకులు ఇవే..
Gold Loan Intreset Rates
Krishna S
|

Updated on: Jul 06, 2025 | 1:46 PM

Share

ఏదైన అవసరం రాగానే టక్కున గుర్తొచ్చేది బ్యాంక్ లోన్.  మన దేశంలో బ్యాంకు లోన్ తీసుకోని వారు చాలా తక్కువ. వ్యాపారస్థుల నుంచి మొదలు సాధారణ వ్యక్తులదాక ఏదో ఒక సందర్భంలో లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్, హోమ్ లోన్ వంటి వివిధ రకాల లోన్లను బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రధానంగా వీటిలో చాలా వాటిని సిబిల్ స్కోర్ ఆధారంగా ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో సిబిల్ స్కోర్ తక్కువున్నా.. అధిక వడ్డీకి లోన్స్ ఇస్తుంటాయి. అయితే సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా ఇచ్చేది గోల్డ్ లోన్. మార్కెట్లో బంగారం విలువను బట్టి 65 నుంచి 75శాతం వరకు బ్యాంకులు లోన్ ఇస్తాయి. తీసుకునే రుణం, చెల్లించే టైమ్, బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. లోన్ తిరిగి చెల్లించే టైమ్ 3 నెలల నుంచి 4ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకులను బట్టి మారుతుంది. చాలా బ్యాంకులు 0.50శాతం నుంచి 1శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేస్తుంటాయి.

గోల్డ్ లోన్‌పై వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు :

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 7.90 నుంచి 8.90శాతంగా ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం గోల్డ్ లోన్స్పై తక్కవ వడ్డీని వసూల్ చేస్తుంది. ఈ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 8.30శాతం నుంచి మొదలవుతుంది. తీసుకునే అమౌంట్, చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీని విధిస్తుంది.

ఫెడరల్ బ్యాంకు కూడా బంగారు రుణాలపై తక్కువ వడ్డీనే విధిస్తుంది. ఈ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు 8.50 నుంచి స్టార్ట్ అవుతుంది.

యూకో బ్యాంకు 8.75 నుంచి 9.15శాతం వరకు బంగారు రుణాలపై వార్షిక వడ్డీ రేటును విధిస్తుంది.

కెనరా బ్యాంకు కూడా 8.75శాతం నుంచి మొదలు పెట్టి లోన్ అమౌంట్, చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీ విధిస్తుంది.

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి 9శాతం వడ్డీని విధిస్తుంది.

యాక్సిస్ బ్యాంకు 8.75 నుంచి 17శాతం వరకు గోల్డ్ లోన్‌పై వార్షిక వడ్డీ రేటును విధిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంకు 9.15శాతం నుంచి అత్యధికంగా 18శాతం వరకు వార్షిక వడ్డీని వసూల్ చేస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం 9.30శాతం నుంచి 17.86శాతం వరకు గోల్డ్ లోన్‌పై వార్షిక వడ్డీని విధిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా 9.40శాతం వడ్డీని వసూల్ చేస్తుంది.

అంతేకాకుండా కోటక్ మహేంద్ర బ్యాంకు 10.56శాతం, కర్ణాటక బ్యాంకు 10.68శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 10.83 నుంచి 16.28శాతం వడ్డీని విధిస్తున్నాయి.