AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo Reno10: అదిరే ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఒప్పో.. 64ఎంపీ కెమెరాతో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది.

Oppo Reno10: అదిరే ఆఫర్లతో ఆకర్షిస్తున్న ఒప్పో.. 64ఎంపీ కెమెరాతో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
Oppo Reno 10
Madhu
|

Updated on: Jul 21, 2023 | 6:30 PM

Share

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో లాంచ్ చేసింది. వాస్తవానికి గత నెలలోనే ఒప్పో తన రెనో10 సిరీస్ ను ఇక్కడ విడుదల చేసింది. ఒప్పో రెనో 10 సిరీస్ లో మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒప్పో రెనో10, రెనో10 ప్రో, రెనో 10 ప్రో ప్లస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఆ సమయంలో వీటిల్లో అత్యంత సరసమైన ధరలో లభించే రెనో10 కు సంబంధించిన వివరాలు ప్రకటించలేదు. ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ఇప్పుడు దీనిని పూర్తిగా రివీల్ చేస్తూ ఒప్పో రెనో10ను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఒప్పో రెనో10 ధర, లభ్యత..

మన దేశంలో ఒప్పో ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లపై వినియోగదారులకు గురి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లాంచ్ అయితే ఒప్పో రెనో10 సిరీస్ ఫోన్లలో రెనో10పై అధిక ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ ధర, ఇతర ప్రారంభ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఒప్పో రెనో10 స్మార్ట్ ఫోన్ రూ. 32,999 ప్రారంభ ధరతో వస్తోంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇది ఒప్పో ఈ-స్టోర్ తో పాటు ఆఫ్ లైన్ లో అధికారిక రిటైల్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

లాంచింగ్ ఆఫర్లు..

ఈ ఒప్పో రెనో10 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకొనే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
  • హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 3,000 తగ్గింపును పొందుతారు. అలాగే కార్డుదారులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను కూడా వినియోగించుకోవచ్చు.
  • వినియోగదారులు రిటైల్ అవుట్ లెట్లో ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ వంటి ప్రముఖ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష బ్యాక్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
  • అలాగే టీవీఎస్ క్రెడెట్, హెచ్ డీబీ, ఫైనాన్షియల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3000 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఆయా కార్డుల వినియోగదారులు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
  • పాత ఒప్పో ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 4000 వరకూ ఎక్స్ చేంజ్ ప్లస్ లాయల్టీ బోనస్ ను పొందొచ్చు. మై ఒప్పో ద్వారా వినియోగదారులు యూ ట్యూబ్ ప్రీమియం, గూగల్ వన్ లను ఉచితంగా మూడు నెలల పాటు ట్రయల్ వెర్షన్ పొందొచ్చు.

ఒప్పో ప్రీమియం సర్వీస్ ఆఫర్..

  • ఒప్పో అద్భుతమైన సర్వీస్ ను అందిస్తుంది. ప్రత్యేకమైన హాట్ లైన్ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 9958808080 నంబర్ కాల్ చేస్తే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి.
  • ఫిర్యాదు చేసిన 72 గంట్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
  • ఒప్పో స్మార్ట్ ఫోన్ల సర్వీస్/రిపేర్ల కోసం ఈఎంఐ ఆప్షన్ ను వాడుకోవచ్చు.

ఒప్పో రెనో10 స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది. కలర్ ఓఎస్ 13.1తో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇది పనిచేస్తుంది.

దీనిలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఫాటు, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది. 67 వాట్ల సూపర్ వీఓఓసీ చార్జింగ్ సపోర్టుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..