Vivo Y100A: అతి తక్కువ ధరలో వివో నుంచి 5జీ ఫోన్.. డిజైన్, ఫీచర్లు మామూలుగా లేవు..

వివో వై 100 స్మార్ట్ ఫోన్ కు కొనసాగింపుగా అంతకన్నా తక్కువ ధరకే 5జీ వేరియంట్ ఫోన్ వివో వై 100ఏ పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని డిజైన్ అంతా వివోవై100 లాగానే ఉంటుంది.

Vivo Y100A: అతి తక్కువ ధరలో వివో నుంచి 5జీ ఫోన్.. డిజైన్, ఫీచర్లు మామూలుగా లేవు..
Vivo Y100a
Follow us
Madhu

|

Updated on: Apr 11, 2023 | 4:30 PM

హంగు, ఆర్భాటం లేదు.. ఎటువంటి లీక్ లుగానీ, ప్రమోషన్లు గానీ లేవు.. సైలెంట్ గా మార్కెట్లోకి వచ్చింది వివో నుంచి కొత్త ఫోన్.. అదిరి ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్ తో వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఇక మున్ముందు ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మన దేశంలో వివో బ్రాండ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వివో స్మార్ట్ ఫోన్ డిజైన్ కే చాలా మంది ఆకర్షితులవుతారు. ఇప్పుడు తన సరికొత్త 5జీ వేరియంట్ మొబైల్ ఫోన్ ను ఇటీవల లాంచ్ చేసింది. వివో వై 100ఏ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 20,000 లోపు ధరలోనే అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

డిజైన్, లుక్.. వివో వై 100 స్మార్ట్ ఫోన్ కు కొనసాగింపుగా అంతకన్నా తక్కువ ధరకే 5జీ వేరియంట్ ఫోన్ వివో వై 100ఏ పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని డిజైన్ అంతా వివోవై100 లాగానే ఉంటుంది. వెనుక వైపు రెండు కెమెరా మాడ్యూల్స్ తో మూడు సెన్సార్స్ వస్తాయి. అలాగే వెనుక వైపు కలర్ చేంజింగ్ ఫీచర్ ఉంటుంది. సూర్యకాంతి వచ్చిన తర్వాత ప్యానెల్ రంగు మారుతుంది.

కెమెరా సెటప్.. వివో వై100ఏ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు 2ఎంపీ లెన్స్‌లతో పాటు 64ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ స్నాపర్ ఉంది.

ఇవి కూడా చదవండి

డిస్ ప్లే.. వివో వై100ఏ స్మార్ట్‌ఫోన్ 6.38-అంగుళాల ఫుల్ + అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్ డీఆర్ 10 ప్లస్ సపోర్ట్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

సామర్థ్యం.. ఈ ఫోన్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. వివో వై100ఏ ఫోన్ 8జీబీ ర్యామ్ తోపాటు మరో 8జీబీ వర్చువల్ ర్యామ్ ను కలిగి ఉంది. అలాగే 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఎంపికలలో అందుబాటులో ఉంది. 44వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 13 పై నడుస్తుంది.

కనెక్టివిటీ.. ఈ ఫోన్ 5జీ 4జీ, యూఎస్బీ సీ పోర్టు, 3.5ఎంఎం జాక్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది.

కలర్ ఆప్షన్లు.. ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగులలో ఏ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ధర ఎంతంటే.. వివో వై100ఏ స్మార్ట్‌ఫోన్ కచ్చితమైన ధరను కంపనీ ఇంకా వెల్లడి చేయలేదు. దాదాపు రూ. 20 వేల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..