Iphone: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులో ‘హే సిరి’..

ఐఫోన్ వాడాలనేది ఇంకా చాలామందికి ఉన్న డ్రీమ్. ఆపిల్ ప్రొడక్ట్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 20 నుంచి 30 శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ వాడేది ఐఫోనే. పూర్తిగా వాడడం రాకున్నా అది చేతిలో ఉండడం ఒక స్టేటస్ సింబల్‎గా మారిపోయింది. ఐఫోన్ రావడంతోనే సాంకేతిక రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగానే హ్యాండ్ ఫ్రీ మొబైల్ ఆపరేషన్ హే సిరి. ఫోన్ ముట్టుకోకుండానే మొబైల్ ని యూస్ చేయొచ్చు. కాల్స్ చేయొచ్చు.. మెసేజ్‎లు పంపొచ్చు. ఫోన్లో ఉన్న అనేక అప్లికేషన్స్ ఓపెన్ చేయొచ్చు.

Iphone: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులో 'హే సిరి'..
Representative Image
Follow us

| Edited By: Aravind B

Updated on: Sep 18, 2023 | 6:55 PM

ఐఫోన్ వాడాలనేది ఇంకా చాలామందికి ఉన్న డ్రీమ్. ఆపిల్ ప్రొడక్ట్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా 20 నుంచి 30 శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ వాడేది ఐఫోనే. పూర్తిగా వాడడం రాకున్నా అది చేతిలో ఉండడం ఒక స్టేటస్ సింబల్‎గా మారిపోయింది. ఐఫోన్ రావడంతోనే సాంకేతిక రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగానే హ్యాండ్ ఫ్రీ మొబైల్ ఆపరేషన్ హే సిరి. ఫోన్ ముట్టుకోకుండానే మొబైల్ ని యూస్ చేయొచ్చు. కాల్స్ చేయొచ్చు.. మెసేజ్‎లు పంపొచ్చు. ఫోన్లో ఉన్న అనేక అప్లికేషన్స్ ఓపెన్ చేయొచ్చు. మ్యాప్స్ ద్వారా మనకు కావాల్సిన డెస్టినేషన్ కి డైరెక్షన్స్ కూడా పొందవచ్చు. ఐఫోన్ లో ఉన్న చాలా ప్రీమియం ఫీచర్ హే సిరి. కానీ ఇది ఇప్పటివరకు కొంతమంది మాత్రమే వాడగలుగుతున్నారు. అందుకు కారణం హే సిరి ఇంగ్లీష్ లో ఉండడం.

గతంలో పూర్తిగా బ్రిటన్ అమెరికన్ స్లాంగ్ లో ఉన్న సిరి ఫీచర్స్ ని కాస్త ఇండియన్ స్లాంగికి మార్చారు. ఇప్పుడు పూర్తిగా భారతీయ భాషల్లోకి హే సిరి ప్రవేశపెడుతున్నారు. IOS 17 అప్డేట్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. అంటే ఇకపై ఆపిల్ ఫోన్ తో ఏం చక్కా తెలుగులోనే మాట్లాడొచ్చు. ఎవరికైనా ఫోన్ చేయాలంటే తెలుగులోనే ఆ కాంటాక్ట్ పేరు చెప్పి ఫోన్ చేయమని అడగొచ్చు. ఇప్పుడు వాడుతున్న హే సిరి ఫీచర్స్ అన్ని తెలుగులో వాడుకోవచ్చు. ఇది ఆపిల్ ఫోన్లలో పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. సామాన్యులు కూడా ఆపిల్ ఫోన్లకు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతోపాటే ఐఓఎస్ 17 అప్డేట్ నుంచి తెలుగు కీప్యాడ్ కూడా అందుబాటులోకి రానుంది. అదేంటి ఇప్పుడు తెలుగు కీప్యాడ్ ఉంది కదా అనుకుంటున్నారా… ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగులో వచ్చే ట్రాన్‌స్లేషన్ కీప్యాడ్ ది. సో పూర్తిగా ఆపిల్ ఫోన్ ని ఒక్క ఇంగ్లీష్ ముక్క రాకపోయినా హ్యాపీగా వాడుకోవచ్చు.

అయితే దీనికి పోటీగా గూగుల్ కూడా ఇదే సదుపాయం తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకే గూగుల్ కొంతమంది తెలుగును స్వీకరించి సమాధానం చెబుతుంది. కానీ అది పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. కానీ ఆపిల్ సంస్థ ఏదైనా ప్రవేశపెట్టేముందు దాన్ని చాలా తనిఖీ చేసిన తర్వాతే ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతీయ భాషల్లో హాయ్ సిరి కూడా గూగుల్ నుంచి పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక విధంగా చాలా మంచి విషయం.సెర్చ్ ఇంజన్ల ద్వారా అనేక విషయాలను తెలుగులో వినియోగదారులు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్