Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nothing Smartwatch: నథింగ్ నుంచి కొత్త టెక్ గ్యాడ్జెట్లు.. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ లాంచింగ్‌కు రెడీ..

నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ పలు టెక్ ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 26న బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్ గ్యాడ్జెట్లను తీసుకొస్తోంది. నథింగ్ ఇటీవలే తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ను ప్రకటించిన సమయంలో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, రిస్ట్ వాచ్ ను త్వరలో తీసుకొస్తామని ప్రకటించింది. నథింగ్ కంపెనీ చెప్పినట్లుగానే తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ తో పాటు ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Nothing Smartwatch: నథింగ్ నుంచి కొత్త టెక్ గ్యాడ్జెట్లు.. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ లాంచింగ్‌కు రెడీ..
Nothing Cmf Watch And Ear Buds
Follow us
Madhu

|

Updated on: Sep 18, 2023 | 6:20 PM

సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో నథింగ్ ఫోన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఫోన్ రూపును సరికొత్తగా ఆవిష్కరించి, వినియోగదారుల కొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన రెండు వేరియంట్లు మార్కెట్లో మంచి గుర్తింపునే పొందాయి. ఇదే క్రమంలో నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సీఎంఎఫ్ పలు టెక్ ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 26న బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్ గ్యాడ్జెట్లను తీసుకొస్తోంది. నథింగ్ ఇటీవలే తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ను ప్రకటించిన సమయంలో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, రిస్ట్ వాచ్ ను త్వరలో తీసుకొస్తామని ప్రకటించింది. నథింగ్ కంపెనీ చెప్పినట్లుగానే తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ తో పాటు ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఆన్ లైన్/ఆఫ్ లైన్లో అమ్మకం..

సీఎంఎఫ్ బై నథింగ్ కంపెనీ మెరుగైన డిజైన్‌లను అందించడం ద్వారా యాక్సెసిబిలిటీకి మొదటి స్థానం కల్పించి, ఫ్యాషన్ టెక్నాలజీని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సీఎంఎఫ్ లాంచ్ చేయనున్న స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ విజయ్ సేల్స్ తో పాటు కొన్ని నిర్దిష్ట రిటైల్ స్టోర్‌లలో ఆఫ్‌లైన్ అందుబాటులో ఉంటాయి. అలాగే మింత్రా, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు కంపనీ ప్రకటించింది.

అద్భుతమైన డిజైన్‌ను డెమోక్రటైజ్ చేయడం అనేది కంపెనీ ప్రధాన భావన కనిపిస్తోంది. తద్వారా ఇది మరింత మంది వ్యక్తులను చేరుకోవడానికి ఇది సాయపడుతుంది. రిస్ట్ వాచ్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌ ఉపకరణాలను వారి మొదటి వరుస ఉత్పత్తులుగా అందించాలనుకుంటున్నారు. అయితే ఈ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. సీఎంఎఫ్ బై నథింగ్ నుంచి ప్రారంభ బ్యాచ్ టెక్ గ్యాడ్జెట్లు ఏమి ఉండాలో ప్రివ్యూని మాత్రమే ఆ కంపెనీ ప్రకటించింది. అయితే వీటి ధరలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

రూ. 5,000లోపు రేంజ్‌లో..

ఆన్ లైన్ లో వస్తున్న సమాచారం ప్రకారం సీఎంఎఫ్ వాచ్ ప్రో ధర రూ. 4,500 ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం రూ. 5,000 కంటే తక్కువ ధరకు అనేక స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీఎంఎఫ్ తన మొదటి వాచ్‌ని ఈ శ్రేణిలో నిజంగా ధర నిర్ణయించాలని భావిస్తే, అది కచ్చితంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. బడ్స్ ప్రో ధర రూ.3,500గా ఉంది. దీనికి జీఏఎన్ 65 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ ధర రూ. 3,000 అని పుకారు వచ్చింది. అయితే, ఈ ధరలు అధికారికం కాదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..