Reliance Jio AirFiber: రిలయన్స్ నుంచి సరికొత్త ఎయిర్ ఫైబర్.. ఏకంగా 1.5 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్..
జియో ఎయిర్ ఫైబర్ పేరుతో కొత్త వైర్ లెస్ ఇంటర్ నెట్ సర్వీస్ ను తీసుకొస్తోంది. సెప్టెంబర్ 19 అంటే మంగళవారం దీనిని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ కొత్త ఎయిర్ ఫైబర్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోడానికి, హై డెఫినెషన్ చిత్రాలు ఆన్ లైన్ లో ఎటువంటి బఫరింగ్ లేకుండా వీక్షించడానికి, వీడియో కాన్ఫరెన్స్ లు ఎటువంటి ల్యాగ్ లేకుండా నిర్వహించుకోడానికి బాగా ఉపయోగపడుతుందని రిలయన్స్ ప్రకటించింది.

చవకైన, నాణ్యమైన సేవలకు పెట్టింది పేరైన రిలయన్స్ మరో సరికొత్త ఇంటర్ నెట్ సర్వీస్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జియో ఎయిర్ ఫైబర్ పేరుతో కొత్త వైర్ లెస్ ఇంటర్ నెట్ సర్వీస్ ను తీసుకొస్తోంది. సెప్టెంబర్ 19 అంటే మంగళవారం దీనిని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. వాస్తవానికి గతేడాది జరిగిన 45వ వార్షిక జనరల్ మీటింగ్ లో దీనిని తొలిసారి ప్రకటించారు. ఈ కొత్త ఎయిర్ ఫైబర్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోడానికి, హై డెఫినెషన్ చిత్రాలు ఆన్ లైన్ లో ఎటువంటి బఫరింగ్ లేకుండా వీక్షించడానికి, వీడియో కాన్ఫరెన్స్ లు ఎటువంటి ల్యాగ్ లేకుండా నిర్వహించుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని రిలయన్స్ ప్రకటించింది. ఈ పోర్టబుల్ వైర్ లెస్ ఇంటర్ నెట్ సర్వీస్ ఇంట్లో అవసరాలతో పాటు ఆఫీసులకు కూడా బాగా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. ఈ సర్వీస్ తో 1.5జీబీపీఎస్ స్పీడ్ తో నెట్ ను ఆస్వాదించవచ్చని వివరించింది. అదనంగా, ఈ రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ కు పేరెంటల్ కంట్రోల్స్, వైఫై 6 కాంపాటిబిలిటీ, బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫైర్ వాల్ వంటి ఫీచర్లు ఉంటాయి.
5జీ టెక్నాలజీతో..
జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన సరికొత్త వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవ. ఇది 5జీ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇవి సాధారణ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లకు సమానం. జియో ఎయిర్ ఫైబర్ పోర్టబుల్, సెటప్ చేయడం సులభం అని జియో పేర్కొంది. మీరు చేయాల్సిందల్లా దాన్ని ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేయడమే. ఇప్పుడు ట్రూ 5జీ అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి లింక్ చేయబడింది, మీ ఇంటికి వ్యక్తిగత వైఫై హాట్‌స్పాట్ ఉంది. మీ ఇంటిని వేగంగా కనెక్ట్ చేయడం చాలా సులభమని తెలిపింది. ఇది చాలా వేగంగా డౌన్ లోడ్లు చేయడంతో పాటు వైఫై 6 కనెక్టివిటీ, సెట్ టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్ కు సహకరిస్తుంది.
ధర ఎంతంటే..
జియో ఎయిర్ ఫైబర్ ప్లగ్-అండ్-ప్లేగా రూపొందించబడింది. ఇది వినియోగదారులకు దాని వినియోగాన్ని, ప్రాప్యతను పెంచుతుంది. దీని ధర కూడా మార్కెట్లో కాస్త ఇతర పోటీదారులను బట్టి నిర్ణయించారని తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 6,000 ఉంటుంది. ఇది పోర్టబుల్ గాడ్జెట్ యూనిట్‌ని కలిగి ఉన్నందున, దాని ధర బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..