Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix zero 5g: రూ. 20 వేలలోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 50 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్‌.

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ జిరో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే చైనాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కాగా తాజాగా భారత్‌లో కూడా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు...

Infinix zero 5g: రూ. 20 వేలలోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 50 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్‌.
Infinix Zero 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2023 | 5:43 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ జిరో పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే చైనాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కాగా తాజాగా భారత్‌లో కూడా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు..

ఇన్‌ఫినిక్స్‌ జీరో 5జీ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 19,500గా నిర్ణయించారు. అయితే ఇతర మోడల్స్‌కి సంబంధించిన ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తేఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + ఐపీఎస్‌ ఎల్‌టీపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 5జీ ఎస్‌ఓసీ, ఆర్మ్ మాలి-G68 MC4 GPU ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 బేస్‌డ్‌ ఎక్స్ఓస్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 జీబీ ర్యామ్‌తో పాటు, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

ఇక కెమెరాకు ఈ ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కెమెరా క్లారిటీ విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్‌ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగా పిక్సెల్‌, 2 మెగాపిక్సెల్‌, 2 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..