AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Charger: మీరు వాడుతున్న చార్జర్ ఒరిజినలా? నకిలీనా?.. ఫేక్ చార్జర్‌ను ఎలా గుర్తించాలంటే?

ఒకప్పుడు ఫోన్‌ కొంటే.. దానితో పాటు ఛార్జర్, ఇయర్ ఫోన్స్, ఇలా అన్ని కంపెనీ వారే ఇచ్చేవారు. కానీ ఇటీవల చాలా కంపెనీలు కేవలం ఫోన్‌లు, వాటితో పాటు చార్జింగ్‌ కేబుల్స్‌ మాత్రమే ఇస్తున్నాయి. అడాప్టర్స్ ఇవ్వడం ఆపేశాయి. దీంతో చాలా మంది అడాప్టర్లను బయట కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న చాలా మంది ఫేక్‌ అడాప్లను మార్కెట్‌లోకి తెచ్చి వర్జినల్ పేర్లతో అమ్ముతున్నారు.

Fake Charger: మీరు వాడుతున్న చార్జర్ ఒరిజినలా? నకిలీనా?.. ఫేక్ చార్జర్‌ను ఎలా గుర్తించాలంటే?
Fake Phone Charger
Rakesh Reddy Ch
| Edited By: Anand T|

Updated on: Nov 26, 2025 | 10:40 AM

Share

మనిషికి ఫుడ్ ఎంత అవసరమో.. మనం రోజూ ఉపయోగించే ఫోన్కి చార్జర్ అంతే ముఖ్యం. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వడం ఆపేసాయి. దీంతో బయట మార్కెట్లో చార్జర్ కొనడం తప్పనిసరిగా మారింది. గతంలో వాడుతున్న చార్జర్ ఉన్న ఫోన్ బ్యాటరీ కెపాసిటీలు మారుతుండడం, హై స్పీడ్ చార్జర్ల అవసరాలు పెరుగుతుండడంతో కొత్త చార్జింగ్ అడాప్టర్లను కొనడం అవసరంగా కనిపిస్తుంది. అయితే ఫోన్ తయారు చేసే కంపెనీలు ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వకపోవడంతో మనం బయట అనేక కంపెనీల చార్జర్లను కొంటున్నాం. ఇక్కడే ఆయా కంపెనీల పేర్లతో డూప్లికేట్, ఫేక్ చార్జీలు కూడా మార్కెట్లోకి కుప్పలుతిప్పలుగా వచ్చిపడ్డాయి. దాదాపుగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న చార్జింగ్ అడాప్టర్లలో సగం అత్యంత తక్కువ నాణ్యతతో ఉన్న ఫేక్ బ్రాండింగ్ చార్జర్లని నిపుణులు చెబుతున్నారు.

మరి వీటిని గుర్తించడం ఎలా??

చాలా సింపుల్.. మీరు కొత్త చార్జర్ కొనేటప్పుడు ఒక చిన్న మ్యాగ్నెట్ తీసుకెళ్లండి. ఈ చిన్న అయస్కాంతం మీరు కొనబోతున్న చార్జర్ అసలు నకిలీదా ఒక్క క్షణంలో పట్టేస్తుంది. మీరు కొనబోతున్న చార్జర్ 2 పిన్నుల దగ్గర అయస్కాంతాన్ని ఉంచండి. అది ఆకర్షించింది అంటే అది నాసిరకం నకిలీ చార్జర్ అని అర్థం. ఎందుకంటే ఒరిజనల్చార్జర్లో ఐరన్ వాడడరు.. ఫేక్వాటిలో మాత్రమే ఐరన్ వాడుతారు అందుకే మాగ్నెట్దానికి అతుక్కొని ఉండిపోతుంది. ఒక వేళ మీ కొనబోయే చార్జర్కు మాగ్నెట్ అతుక్కోకపోతే అది ఒరిజినల్ బ్రాండెడ్ చార్జర్ అని అర్థం. ఎప్పుడూ నాణ్యమైన చార్జర్లకి స్టెయిన్లెస్ స్టీల్ వాడుతారు.

నకిలీ చార్జర్లు వాడడం వల్ల ఏమవుతుంది?

దీర్ఘకాలంగా నకిలీ చార్జర్ వాడడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుంది. అంతేకాదు త్వరగా ఫోన్లు హీట్ ఎక్కడం, ఫోన్ కి సరిపడా పవర్ కాకుండా ఎక్కువ తక్కువగా పవర్ రావడం వల్ల ఇతర విడిభాగాలు కూడా దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఫోన్ అతిగా హీట్ అవ్వడం వల్ల పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఒరిజినల్ చార్జర్ వాడడం వల్ల ఎంత పవర్ సప్లై అవ్వాలో ఫోన్ కి అంతే పవర్ సప్లై అవుతుంది. దీంతోపాటు ఫోన్ ఫుల్ చార్జ్ అవ్వగానే ఆటో కట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఈ చార్జర్ లో ఉంటుంది. సో ఇక నుంచి సింపుల్గా చిన్న మ్యాగ్నెట్ బిళ్ళతో అసలేదో సిసలేదు గుర్తించండి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.