Asus Smartphones: ఎంత సేపు వాడినా వేడెక్కని ఫోన్లు.. గేమ్స్ ఆడే వారికి బెస్ట్ ఆప్షన్.. పూర్తి వివరాలు ఇవి..
గేమ్స్ ఆడుతుంటే మీ ఫోన్ ఊరికే వేడెక్కిపోతోందా? చార్జింగ్ ఊరికే అయిపోతోందా? అయితే మీ సమస్యలకు ఏకైక సమాధానం ఈ స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్లలో ఎంతసేపు వాడినా వేడెక్కకుండా ఉండే ప్రత్యేక ఫీచర్ ఉంది. అలాగే 6000ఎంఏహెచ్ బ్యాటరీ అంత త్వరగా అయిపోదు.

మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. అసుస్ ఆర్ఓజీ ఫోన్ 7 సిరీస్ నుంచి రెండు ఫోన్లు భారతీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. ఆర్ఓజీ ఫోన్ 7, ఆర్ఓజీ ఫోన్ 7 అల్టిమేట్ పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ప్రారంభ ధర రూ. 74,999గా ఉంది. వీటిల్లో ప్రత్యేకతలు ఎంటంటే రెండు ఫోన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ఉంటుంది. 165Hz శామ్సంగ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. గేమింగ్ కోసం ఎయిర్ ట్రిగర్ కన్లోల్ ఉంటుంది. దీనిలోని బ్యాటరీ 6,000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెండు వేరియంట్లలో..
అసుస్ ఆర్ఓజీ ఫోన్ 7 రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన అసుస్ ఆర్ఓజీ ఫోన్ 7 ధర రూ. 74,999గా ఉంది. ఇది ఫ్యాంటమ్ బ్లాక్, స్టోర్మ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే 16జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడిన అసుస్ ఆర్ఓజీ ఫోన్ 7 అల్టిమేట్ ధర రూ. 99,999గా ఉంది. ఇది స్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్ లో లభిస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు విజయ్ సేల్స్ లో అందుబాటులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు ఇవి..
అసుస్ ఆర్ఓజీ ఫోన్ 7, ఆర్ఓజీ ఫోన్ 7 అల్టిమేట్ గేమింగ్ ఫోన్లు రెండు 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 165Hz రిఫ్రెష్మెంట్ రేటుతో వస్తాయి. రెండింటిలోనూ 3.2 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, క్వాల్ కామ్ అడ్రెనో 740జీపీయూ తో లింక్ అయ్యి ఉంటుంది. రెండు హ్యాండ్ సెట్లు ఆండ్రాయిడ్ 13, ఆర్ఓజీ యూఐ, జెన్ యూఐ ఆధారంగా పనిచేస్తోంది. అలాగే ఇది ఐపీ54 రేటింగ్ తో వస్తుంది.



కెమెరా సెట్ అప్..
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే రెండు ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ అల్ట్రా వైడ్, 8ఎంపీ మాక్రో కెమెరా ఉంటుంది. అలాగే 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యాన్ని పరిశీలస్తే రెండు ఫోన్లు 6,000ఎంఏహెచ్ ఉంటుంది.
ప్రత్యేక ఫీచర్ ఇది..
ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్ ఇది. గేమ్స్ ఎంత సేపు ఆడినా ఈ ఫోన్ వేడెక్కదు. ఎందుకంటే ఈ ఫోన్ లో ఏరో యాక్టివ్ కూలర్ 7 ఉంటుంది. ఇది ప్రత్యేకంగా గేమింగ్ కోసం ఏర్పాటు చేశారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఫోన్ అతిగా వేడెక్కుండా ఇది చల్లబరుచుతుంది. దీతో పాటు యూఎస్బీ సీ కనెక్షన్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..