Oppo F23 5G: మార్కెట్లోకి మరో 5జీ ఫోన్.. 64ఎంపీ, 32ఎంపీ కెమెరా సెటప్.. లాంచింగ్ ఆఫర్ కింద రూ. 5వేల వరకూ తగ్గింపు..
ఒప్పో నుంచి మరో మిడ్ రేంజ్ 5జీ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఒప్పో ఎఫ్23 పేరిట మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది.

మార్కెట్లో 5జీ ఫోన్ల జాతర నడుస్తోంది. రోజుకో ఫోన్ మార్కెట్ తలుపుతడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. 5జీ నెట్ వర్క్ దాదాపు అన్ని సిటీల్లో అందుబాటులోకి రావడంతో కంపెనీలు కూడా 5జీ వేరియంట్లో ఫోన్లు లాంచ్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒప్పో నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఒప్పో ఎఫ్23 పేరిట మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్ ఉంటుంది. ఒప్పో లాంచింగ్ ఆఫర్ల కింద ఈ ఫోన్ పై భారీ ఆఫర్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధర, లభ్యత ఇలా..
ఒప్పో ఎఫ్23 ఒకే వేరియంట్లో లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇది వస్తోంది. దీని ధర రూ. 24,999గా ఉంది. ఇది రెండు కలర్ వేరింయట్లలో వస్తుంది. బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు అమెజాన్, అలాగే ఒప్పో అధికారిక సైట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. మే 18 నుంచి ఇది డెలివరీలు ప్రారంభం అవుతాయి.
లాంచింగ్ ఆఫర్లు ఇవి..
- ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే 10శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఆఫర్ మే 18 నుంచి మే 31 వరకూ అందుబాటులో ఉంటుంది.
- ఒప్పో పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 2500 వరకూ తగ్గింపు, వేరే కంపెనీ స్మార్ట్ ఫోన్ అయితే రూ. 1500 వరకూ తగ్గింపు పొందవచ్చు.
- అలాగే బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్స్ వంటి సంస్థల ద్వారా జీరో డౌన్ పేమెంట్ ద్వారా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు ఇవి..
ఒప్పో ఎఫ్ 23 5జీ ఫోన్లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.



కెమెరా సెటప్..
ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో షూటర్ ఉంటుంది. ముందు వైపు 32 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. 67 వాట్ల సామర్థ్యంతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
