WhatsApp: వాట్సాప్ హిస్టరీని కొత్త ఫోన్లోకి మార్చుకోవడం ఎలా? ఈ టిప్స్ పాటించండి.. చాలా ఈజీ..

వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అయితే కొంత మంది వినియోగదారులు తమ ఫోన్లను మార్చుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒకఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మరో ఫోన్లోకి రావాలని కోరుకుంటారు. మరి అలా రావాలంటే ఏం చేయాలి? అందుకోసం వాట్సాప్ ఈజీ విధానాన్ని తీసుకొచ్చింది. అదే క్యూఆర్ కోడ్ విధానం.

WhatsApp: వాట్సాప్ హిస్టరీని కొత్త ఫోన్లోకి మార్చుకోవడం ఎలా? ఈ టిప్స్ పాటించండి.. చాలా ఈజీ..
Whatsapp
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2023 | 4:07 PM

వాట్సాప్ మెసెంజర్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యాప్. ప్రస్తుతం ఇది లేని సమాజాన్ని మనం ఊహించలేం. అంతలా జనాల్లో కనెక్ట్ అయిపోయింది. దానిలో గ్రూప్స్, చానెల్స్, స్టేటస్ బార్, వాయిస్, వీడియో కాల్స్ అన్ని ఫీచర్లు వినియోగదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అయితే కొంత మంది వినియోగదారులు తమ ఫోన్లను మార్చుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒకఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మరో ఫోన్లోకి రావాలని కోరుకుంటారు. మరి అలా రావాలంటే ఏం చేయాలి? అందుకోసం వాట్సాప్ ఈజీ విధానాన్ని తీసుకొచ్చింది. అదే క్యూఆర్ కోడ్ విధానం. దీనిని ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఈ క్యూఆర్ కోడ్ సాయంతో వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే మీరు మీ వాట్సాప్ ను తప్పనిసరిగా బ్యాక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ ఫోన్లో వాట్సాప్ అప్ డేట్ చేసుకోండి..

మీ పాత ఫోన్లోని వాట్సాప్ కొత్త ఫోన్లోకి హిస్టరీతో సహా తీసుకురావాలంటే మొదటిగా మీరు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే మీ పాత ఫోన్, కొత్త ఫోన్ రెండూ ఒకే విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండాలి. అంటే ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్, ఐఓఎస్ టు ఐఓఎస్ కు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు కనీసం 5.1 వెర్షన్ ను కలిగి ఉండాలి. ఐఓఎస్ వినియోగదారులు అయితే 2.23.9.77 వెర్షన్ లేదా అంతకు పైగా ఉన్న వాట్సాప్ వెర్షన్ ను కలిగి ఉండాలి. అలాగే రెండూ కూడా ఒకటే వైఫై కి కనెక్ట్ అయ్యి ఉండేటట్లు చూసుకోవాలి.

ఏమి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు..

వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ ఫర్ లో మీరు చాట్ సమాచారం మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. మెసేజెస్, మీడియా ఫైల్స్ వంటివి చేసుకోవచ్చు. అయితే పేమెంట్స్, కాల్ హిస్టరీ మాత్రం ట్రాన్స్ ఫర్ కావని తెలుసుకోవాలి. మీరు ప్రక్రియను ప్రారంభించే ముందు కొత్త ఫోన్లో వాట్సాప్ రిజిస్టర్ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా చేయాలి..

ఇవి కూడా చదవండి

ఆండ్రాయిడ్ ఫోన్లో ఇలా..

  • మొదటిగా మీ పాత మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.
  • దానిలో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్లి సెట్టింగ్స్ ఓపెన్ చేసి, చాట్స్ లోకి వెళ్లాలి. దానిలో ట్రాన్స్ ఫర్ చాట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్టార్ట్ బటన్ ను నొక్కాలి.
  • ఇప్పుడు మీరు కొత్త ఫోన్లో వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసి, రిజిస్టర్ చేయండి. అది కూడా మీ పాత ఫోన్లో వాడిన నంబర్ తో నే రిజిస్టర్ అవ్వాలి.
  • తర్వాత స్మార్ట్ అనే బటన్ నొక్కడం ద్వారా పాత ఫోన్లోని చాట్ హిస్టరీ బదిలీ ప్రక్రియను ప్రారంభించండి.
  • కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. అవి ఇచ్చాక క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది.
  • దానిని పాత ఫోన్ సాయంతో స్కాన్ చేయాలి.
  • తర్వాత అడిగిన పర్మిషన్ మంజూరు చేస్తే ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తయ్యాక డన్ బటన్ పై నొక్కాలి.

ఐఓఎస్ డివైజ్‌లో ఇలా..

  • మీ పాత ఫోన్లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి.
  • సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్ పై క్లిక్ చేసి, ట్రాన్స్ ఫర్ చాట్స్ టు ఐఫోన్ పై క్లిక్ చేశాక, స్టార్ట్ బటన్ నొక్కాలి.
  • కొత్త ఫోన్లో మీ వాట్సాప్ ఇన్ స్టాల్ చేసి, పాత ఫోన్లోని వాట్సాప్ కు వినియోగించిన ఫోన్ నంబర్ తోనే కొత్త ఫోన్లోకూడా రిజిస్టర్ కావాలి.
  • తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది.
  • దానిని పాత ఐఫోన్ తో స్కాన్ చేయాలి. వెంటనే హిస్టరీ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ట్రాన్స్ ఫర్ పూర్తయ్యాక, మీ కొత్త డివైజ్ లో ప్రొఫైల్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!