AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel Phones: ఇకపై మేడ్ ఇన్ ఇండియా పిక్సల్ ఫోన్స్.. త్వరలో గూగుల్ తయారీ యూనిట్ ప్రారంభం..

ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజాలు కూడా మన దేశంతో తయారీ యూనిట్లను తీసుకొస్తున్నాయి. చైనాను కాదని ఇక్కడకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని అతి త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెక్ దిగ్గజం తన ఫోన్‌లను చైనాకు బదులుగా భారతదేశంలో తయారు చేయాలని చూస్తోంది.

Google Pixel Phones: ఇకపై మేడ్ ఇన్ ఇండియా పిక్సల్ ఫోన్స్.. త్వరలో గూగుల్ తయారీ యూనిట్ ప్రారంభం..
Google Pixel Phones
Madhu
|

Updated on: Feb 25, 2024 | 7:23 AM

Share

వాణిజ్య పరంగా మన దేశం బాగా వృద్ధి సాధిస్తోంది. ఈ క్రమంలో పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా మన దేశంలో తయారీ యూనిట్లను ప్రారంభిస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడో తయారు చేసి ఇక్కడ విక్రయించే వారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజాలు కూడా మన దేశంతో తయారీ యూనిట్లను తీసుకొస్తున్నాయి. చైనాను కాదని ఇక్కడకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని అతి త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెక్ దిగ్గజం తన ఫోన్‌లను చైనాకు బదులుగా భారతదేశంలో తయారు చేయాలని చూస్తోంది. ఎందుకంటే మన దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని గూగుల్ చూస్తోంది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 10 మిలియన్లకు పైగా పిక్సెల్ ఫోన్‌లను తయారు చేసి విక్రయించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

దక్షిణ భారతదేశంలో..

గూగుల్ హై-ఎండ్ పిక్సెల్ 8 ప్రోని మొదట భారతదేశంలోని దక్షిణ భారత దేశంలో తయారు చేయడం ప్రారంభించాలని యోచిస్తోందని నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, దేశంలోని ఉత్తర భాగంలో పిక్సెల్ 8ని తయారు చేయడం ప్రారంభించేలా ప్రణాళిక చేస్తోంది. యాపిల్, శామ్సంగ్, ఒప్పో, జియోమీ వంటి బ్రాండ్లు ఇప్పటికే మన దేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పాయి. యాపిల్ ఇప్పటికే భారతదేశంలోని దక్షిణ భాగంలో కొన్ని ప్లాంట్లను కలిగి ఉంది.

చైనా నుంచి షిఫ్ట్..

ఇంతకుముందు గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు చాలా వరకు చైనాలో తయారయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని ఇండియాలో కూడా తయారు చేయాలనుకుంటున్నారు. ఫోన్‌ల తయారీకి చైనాపై ఎక్కువగా ఆధారపడకుండా చూసుకోవడానికి గూగుల్ చేస్తున్న ప్రణాళిక ఇది. దీనిని ‘చైనా+2′ వ్యూహం పిలుస్తున్నారు, ఇక్కడ కంపెనీలు తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాయి.

ఇవి కూడా చదవండి

చైనా+2’ వ్యూహం అమలు చేస్తోంది గూగుల్ మాత్రమే కాదు ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రణాళికను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందే ఏంటంటే చైనా నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం ఊరికే జరగదు. సరఫరాదారులు, మెరుగైన సరఫరా గొలుసు స్థితిస్థాపకత కోసం బహుళ చైనాయేతర ఎంపికలను కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ దిశలో మన దేశం మాత్రమే వారికి అనుకూలంగా కనిపిస్తోంది.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2023లో 1 శాతం వృద్ధిని సాధించింది. ప్రపంచ మార్కెట్ మందగమనం మధ్య 146 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో, ముఖ్యంగా చైనాలో క్షీణతకు భిన్నంగా ఉంది. 2024లో మరో 10 మిలియన్ యూనిట్లను రవాణా చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ మధ్య పిక్సల్ ఫోన్ తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలనే దాని నిబద్ధతతో పనిచేస్తోంది.

భారత ప్రభుత్వం ప్రోత్సాహం..

మన దేశంలో గూగుల్ తయారీ ప్రణాళికలు అమలు చేసేలా ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను అందిస్తోంది. స్థానిక సరఫరా గొలుసులను స్థాపించడానికి, కంపెనీలను ఆకర్షించడానికి, కఠినమైన దిగుమతి పరిమితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా దేశంలోని సాంకేతిక తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గూగుల్ బాటలోనే యాపిల్, టైవానీస్ పీసీ, యాసర్, అసుస్టెక్ కంప్యూటర్ వంటి టెక్ దిగ్గజాలు కూడా మన దేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..