Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ష్..! జీమెయిల్‌లో ‘కాన్ఫిడెన్షియల్’ ఫీచర్.. పాస్ వర్డ్ లేకుంటే కష్టమే! పూర్తి వివరాలు తెలుసుకోండి..

Gmail: ఆఫీసులు లేదా, ప్రైవేటు నెట్ సెంటర్లలో పొరపాటున జీమెయిల్ లాగ్ అవుట్ చేయకుండా వదిలేస్తే.. మీ మెయిల్స్ అన్ని బయట వ్యక్తులు యాక్సెస్ చేసే వీలుంటుంది. అలాంటి ప్రమాదాల నుంచి బయట పడేందుకు జీమెయిల్ సరికొత్త టూల్ ని ఆవిష్కరించింది. అదే జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్.

ష్..! జీమెయిల్‌లో ‘కాన్ఫిడెన్షియల్’ ఫీచర్.. పాస్ వర్డ్ లేకుంటే కష్టమే! పూర్తి వివరాలు తెలుసుకోండి..
Gmail
Follow us
Madhu

|

Updated on: Apr 29, 2023 | 6:45 PM

ఇటీవల కాలంలో జీమెయిల్ వినియోగం బాగా పెరిగింది. వ్యక్తిగత అవసరాలతో పాటు ఉద్యోగ అవసరాలకు కూడా జీమెయిల్ ను వాడుతున్నారు. విద్యార్థుల దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ వరకూ కమ్యూనికేషన్ కు జీమెయిల్ ఆధారంగానే సాగుతోంది. మరి అటువంటి జీమెయిల్ లో మీరు పంపిన మెయిల్ మరొకరు చూస్తేరేమో అనే భయం అందరిలోనూ సాధారణంగా ఉంటుంది. ఆఫీసులు లేదా, ప్రైవేటు నెట్ సెంటర్లలో పొరపాటున జీమెయిల్ లాగ్ అవుట్ చేయకుండా వదిలేస్తే.. మీ మెయిల్స్ అన్ని బయట వ్యక్తులు యాక్సెస్ చేసే వీలుంటుంది. అలాంటి ప్రమాదాల నుంచి బయట పడేందుకు జీమెయిల్ సరికొత్త టూల్ ని ఆవిష్కరించింది. అదే జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్. అంటే మీరు పంపే మెయిల్ ఏదైనా ఓ సురక్షిత పాస్ వర్డ్ ను కలిగి ఉంటుంది. దానిని ఎంటర్ చేస్తేనే మీకు ఆ మెయిల్ ని ఓపెన్ చేయడం కుదురుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్..

జీమెయిల్ వినియోగదారుల భద్రత, ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్ ను ఆవిష్కరించింది. ఈ మోడ్ లో వినియోగదారులు మెసేజ్లు, అటాచ్మెంట్లు పంపవచ్చు. అయితే వీటిని ఓపెన్ చేయాలంటే ఆ మెసేజ్ పంపిన వారు ఏర్పాటు చేసిన పాస్ వర్డ్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఆ మెయిల్ ఓపెన్ చేయాలని చూసినా అది పాస్ వర్డ్ అడుగుతుంది. ఈ పాస్ వర్డ్ ఎంటర్ చేయకపోతే అది ఓపెన్ కాదు. దీనివల్ల అన్ అథరైజ్డ్ యాక్సెస్ ను నివారించవచ్చు. అలాగే ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ లో మీరు పంపిన మెయిల్ కి ఎక్సపైరీ డేట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఫైల్ లేదా మెసేజ్ నిర్ణీత గడువు వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. అలాగే మీరు పంపిన ఫైల్ లేదా మెసేజ్ కాపీ కాకుండా, ఫార్వర్డ్ చేయకండా, డౌన్లోడ్ చేయకుండా డిజేబుల్ చేసే ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

కాన్ఫిడెన్షియల్ మోడ్ ని ఇలా వాడాలి..

  • ముందుగా మీరు జీమెయిల్ లోకి వెళ్లి ‘కంపోస్’ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు ఓపెన్ అయిన కొత్త విండోలో కుడిచేతి వైపు కింద ‘టర్న ఆన్ కాన్ఫిడెన్షియల్ మోడ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీరు అప్పటికే దానిని ఆన్ చేసి ఉంటే ఈమెయిల్ కిందకు వెళ్లి ఎడిట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
  • దానిలో మెయిల్ ఎక్సపైరీ డేట్, పాస్ కోడ్ వంటివి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి టెక్ట్స్, అలాగే అటాచ్మెంట్లకు కూడా వర్తిస్తుంది.
  • దానిలో మీరు నో ఎస్ఎంఎస్ పాస్ కోడ్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే మీరు పంపిన మెసేజ్ అవతలి వారి జీమెయిల్ యాప్ లో డైరెక్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఒకవేళ వారు జీమెయల్ యాప్ వినియోగించకపోతే వారి మెయిల్కి పాస్ కోడ్ వెళ్తుంది.
  • ఒకవేళ మీరు ‘ఎస్ఎంఎస్ పాస్ కోడ్’ అని కోడ్ ని ఏర్పాటు చేసుకుంటే అవతలి వ్యక్తికి ఫోన్ నంబర్ ఆధారంగా ఓ టెక్ట్స్ మెసేజ్ రూపంలో పాస్ కోడ్ వస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ‘సేవ్’ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

ఎక్స్ పేరీ డేట్ ఇలా..

వినియోగదారులు మీరు పంపిన కాన్ఫిడెన్షియల్ మెయిళ్లు అవతలి వారు మెయిల్ లో నుంచి మీరు డిలీట్ చేయొచ్చు. అదెలా అంటే..

ఇవి కూడా చదవండి
  • జీమెయిల్ ని ఓపెన్ చేసి, ఎడమచేతి వైపు ఉన్న ఆప్షన్లలో ‘సెంట్’ అనే దానిపై క్లిక్ చేయాలి. మీకు ఓపెన్ అయిన సెంట్ మెయిళ్లలో కాన్ఫిడెన్షియల్ మెయిల్ ను ఎంపిక చేసుకొని ‘రిమూవ్ యాక్సెస్’ ను క్లిక్ చేయాలి.
  • మీరు అవతలి వ్యక్తికి పంపిన మెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్ లో పంపితే అవతలి వారు దాని ఎక్స్ పైరీ డేట్ వరకు లేదా రిమూవ్ యాక్సెస్ క్లిక్ చేసే వరకూ మాత్రమే మీ ఇన్ బాక్స్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..