Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: సామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌పై ఊహకందని ఆఫర్‌.. ఏకంగా రూ. 35 వేలు డిస్కౌంట్‌.

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్‌ లాంచ్‌ చేసిన ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ గ్యాలెక్సీ ఎస్‌ 23. అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఈ కామర్స్‌ దిగ్గజం...

Samsung: సామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌పై ఊహకందని ఆఫర్‌.. ఏకంగా రూ. 35 వేలు డిస్కౌంట్‌.
Samsung Galaxy S23
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 29, 2023 | 6:32 PM

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్‌ లాంచ్‌ చేసిన ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ గ్యాలెక్సీ ఎస్‌ 23. అదిరిపోయే ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ ఆఫర్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఏకంగా రూ. 35 వేల వరకుఇ డిస్కౌంట్‌ అందిస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా వినియోగించుకోవాలి.? ఈ ఫోన్‌ ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌ 23 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ అసలు ధర రూ. 74,999కాగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌గా రూ. 5 వేలు పొందొచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్ఛ్సేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 33వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 36,999కే సొంతం చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌ 23 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో సెంట్రల్లీ అలైన్డ్​ పంచ్​ హోల్, అల్యూమీనియం ఫ్రేమ్, ఇన్​-స్క్రీన్​ అల్ట్రాసానిక్​ ఫింగర్​ప్రింట్ రీడర్,ఐపీ68 రేటెడ్​ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి అధునాతన ఫీచర్లు అందించారు.

ఇక ఇందులో 6.1 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డైమనమిక్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1,750 నిట్స్​ పీక్​ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్​13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..