PrepInsta: నిరుద్యోగులకు వరం ఈ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ యాప్… ప్రెప్ఇన్‌స్టా గురించి తెలుసుకోండి
ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ అప్‌డేట్ చేసుకోలేక చాలా మంది ఉద్యోగాన్ని సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో స్కిల్స్ అప్‌డేట్ చేసుకోడానికి వివిధ సంస్థల్లో జాయిన్ అవుతున్నారు. అయితే కరోనా కారణంగా చాలా వరకూ ఆన్‌లైన్ యాప్స్ ప్రస్తుతం యువత ఉద్యోగాన్ని సాధించడంలో సాయపడుతున్నాయి. దీంతో వారు ఉన్న చోటు నుంచే ప్రతిరోజూ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో బిజీ అవుతున్నారు.
మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం ఇది సగటు విద్యార్థి కోరిక. కానీ ఉద్యోగ శోధనలో చాలా మంది వెనకబడి ఉంటారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ అప్‌డేట్ చేసుకోలేక చాలా మంది ఉద్యోగాన్ని సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో స్కిల్స్ అప్‌డేట్ చేసుకోడానికి వివిధ సంస్థల్లో జాయిన్ అవుతున్నారు. అయితే కరోనా కారణంగా చాలా వరకూ ఆన్‌లైన్ యాప్స్ ప్రస్తుతం యువత ఉద్యోగాన్ని సాధించడంలో సాయపడుతున్నాయి. దీంతో వారు ఉన్న చోటు నుంచే ప్రతిరోజూ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో బిజీ అవుతున్నారు. అయితే ఈ ధోరణిని ముందే గ్రహించిన ఓ ముగ్గురు యువకులు కేవలం రూ.99 ఇన్వెస్ట్‌మెంట్‌తో 2018లో స్థాపించిన ఎడ్-టెక్ కంపెనీ ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్‌తో టాప్ ఎడ్-టెక్ కంపెనీలకు పోటీగా నిలిచింది. పైగా వ్యాపారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే లాభాల్లో ఉన్న ఏకైక కంపెనీగా మారింది. ప్రెప్ ఇన్‌స్టా పేరుతో ఆశయ్ మిశ్రా, అతుల్య కౌశిక్, మనీష్ అగర్వాల్ వారి వినూత్న పద్ధతులు, సమర్పణల కారణంగా 2023లో ఫోర్బ్స్ యొక్క 30 అండర్ 30 జాబితాలకు ఎంపికయ్యారు. వారి గురించి వారి కంపెనీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రెప్‌ఇన్‌స్టా విద్యార్థుల ఉత్తమ ఎంపికలలో ఒకటిగా ఉంటుంది. ఈ ఎడ్‌టెక్ సంస్థ శ్రామిక శక్తి కోసం విద్యార్థులు శిక్షణ ఇచ్చే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఆశయ్ మిశ్రా ప్రెప్‌ఇన్‌స్టా సహ వ్యవస్థాపకుడు, సీఓఓ వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు. బీటెక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేశాడు. చదువుతున్న సమయంలో మంచి కంపెనీ గురించి ఆలోచించి ప్రెప్‌ఇన్‌స్టా వైపుగా అడుగులు వేశాడు. ప్రెప్ఇన్‌స్టా ఎండ్-టు-ఎండ్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్, స్కిల్-బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు, కోడింగ్ ట్యుటోరియల్స్, ఇంటర్వ్యూ కోచింగ్‌లను అందిస్తుంది. ఈ సమగ్ర ప్లాట్‌ఫారమ్ విద్యార్థులను భారత్‌లోని టాప్ కంపెనీలు నిర్వహించే ప్లేస్‌మెంట్ ప్రక్రియలోని అన్ని దశల కోసం ఒక-స్టాప్ షాప్‌గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రెప్ఇన్‌స్టా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. అలాగే 200 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తుంది. ఈ యాప్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ కోసం దాదాపు రూ.6,000 చెల్లించాలి. అయితే ఈ ధర కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ ఇందులోని కంటెంట్ ఇతర యాప్‌లతో పోల్చి చూస్తే చాలా తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.
మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో, అడోబ్, గూగుల, టీసీఎస్, అసెంచర్, క్యాప్‌జెమినీ, హెక్సావేర్, హెచ్‌సీఎల్, ఇన్‌ఫోసిస్ వంటి అగ్ర కంపెనీలు ఈ యాప్‌లో ట్రెయిన్ అయిన విద్యార్థులకు తమ ప్లేస్‌మెంట్స్‌లో ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి 2.25 లక్షల క్రియాశీల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ కంపెనీ ఈ ఏడాది రూ.20 నుంచి రూ.25 కోట్ల ఆదాయాన్ని పొందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ కంపెనీ ఆదాయం గత మూడేళ్ల నుంచి పోల్చుకుంటే నాలుగు రెట్లు పెరిగింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..