గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ మొదలు కానుందట. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ మొదలు కానుందట. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఓ యాప్‌ను రూపొందించింది. దక్షిణ అమెరికా దేశం పెరూలో ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్. ఈ డిస్కవర్ యాప్ ద్వారా పలు మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలు అందించే డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సేవలను థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇరాక్‌తో సహా ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ డిస్క్‌వర్ యాప్ ద్వారా ప్రతీ రోజూ కొంత ఫ్రీ డేటా లభిస్తుంది. అది ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియజేసింది ఫేస్‌బుక్. ప్రతీ రోజూ ఓ సమయంలో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత నుంచి ఈ డేటాను ఉపయోగించుకోవచ్చట. పరిమిత డేటా మాత్రమే లభిస్తుంది కాబట్టి.. మల్టీ మీడియాలో ఫాస్ట్‌గా పని చేయలేదు. ఆయా వెబ్‌సైట్లలోని సమాచారాన్ని మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
కాగా మరో ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించింది ఫేస్‌బుక్ సంస్థ. ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్‌బుక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే ఈ యాప్ ద్వారా బ్రౌజింగ్ హిస్టరీని ఫేస్‌బుక్ సేకరించబోదని వెల్లడించింది.
Read More:
వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్ విడుదలకు గ్రీన్ సిగ్నల్